హైదరాబాద్ : తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు 2024 సంవత్సరానికి గాను తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రకటించింది. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య వివరాలు వెల్లడించారు. పద్య, గేయ కవిత్వంలో రాచాలపల్లి బాబు దేవిదాస శర్మ రచించిన ‘శ్రీరామాయణోపనిషత్తు’, వచన కవితలో తోట నిర్మలా రాణి అద్దం నా చిరునామా కాదు బహుమతులను గెలుచుకున్నాయి. అలాగే నవలా ప్రక్రియలో డాక్టర్ వెన్నం ఉపేందర్ రచించిన ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ గ్రంథం, సాహిత్య విమర్శలో బండారి రాజ్ కుమార్ రచించిన ‘తెలంగాణ కవి ముద్ర’ గ్రంథం , కథ ప్రక్రియ లో డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన ‘కండిషన్స్ అప్లై’ గ్రంథం పురస్కారానికి ఎంపికయ్యాయని వివరించారు. అభినందనీయం.. ‘‘గుమ్మడవెల్లి గ్రామానికి…
Category: సమాచారం
టీజీ భరత్‌కు పద్మశాలీయుల సన్మానం
కర్నూలు : కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను కర్నూలు నగర పద్మశాలీ సంఘం సన్మానించనుంది. నేడు (28.6.2024 శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు మౌర్య ఇన్ హోటల్ పరిధిలోని తన కార్యాలయంలో టీజీ భరత్‌ను కలిసి అభినందనలు తెలపనున్నామని కర్నూలు నగర పద్మశాలీ సంఘం అధ్యక్షులు కస్తూరి వేమయ్య తెలిపారు. కమిటీ సభ్యులు, పద్మశాలీ కులబాంధవులు ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఆయన కోరారు. టీజీ భరత్ గురించి క్లుప్తంగా.. కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్. 1977లో జన్మించిన భరత్ యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో తండ్రి అడుగుజాడల్లో నడిచారు. వ్యాపారంలో తండ్రికి…
నేతన్నల దుస్థితికి పాలకులకు వివరిద్దాం..
హైదరాబాద్ : చేనేతల బలవన్మరణాల నివారణ, నేత కార్మికుల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా.. జూన్ 30వ తేదీన (ఆదివారం) అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు. హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని స్వకుల శాలి భవన్ ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పద్మశాలి ప్రముఖులు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పద్మశాలి సంఘాల నేతలు, చేనేత కార్మిక సంఘాల నాయకులు, వివిధ హోదాలలో ఉన్న పద్మశాలి అధికారులు సమావేశానికి విచ్చేసి చేనేత పరిశ్రమ సంరక్షణ, చేనేతల ఆత్మహత్యల నివారణకు సూచనలు సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రండి..పాలకులను ప్రశ్నిద్దాం.. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేనేతల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. బతుకమ్మ చీరల…
చేనేతల ఆత్మహత్యలను నివారిద్దాం..
‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేనేతల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. బతుకమ్మ చీరల తయారీ తరువాత పనులు లేక పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. మాస్టర్స్ వీవర్స్ వద్ద నేతన్నలకు పని కరువైంది. ఉత్పత్తి చేసిన వస్త్రాలను సర్కారు కొనడం లేదు. గతంలో కొన్న సరుకుకు డబ్బులు ఇంకా చెల్లించాల్సి ఉంది. అర్హులకు పింఛన్లు మంజూరు కావడం లేదు. మంజూరయిన వారికి ఫించన్ డబ్బు సరిగా అందడం లేదు. నేత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కుటుంబాలు నెట్టుకురావడం తలకు మించిన భారమైంది. పనులు లేక చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక తనువు చాలించాల్సి రావడం దురదృష్టకరం. ఇకనైనా మనం మేల్కోవాలి. పాలకులను నిద్ర లేపాలి. చేనేతల ఆత్మహత్యలకు ముగింపు పలకాలి. బలవన్మరణాల నివారణకు అఖిల పక్ష సమావేశం ఏర్పడాలి. చేనేతల సమస్యలన్నింటిని…
తిరుమలలో ప్రక్షాలన మొదలైందా?
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా జంజనం శ్యామలరావు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. విధుల పట్ల నిబద్ధత, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరున్నశ్యామలరావు తనదైన మార్కును చూయించారు. ప్రక్షాలన దిశగా ముందుకు సాగుతున్నారు. తిరుమలలో వాస్తవ పరిస్థితులను తానే స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. వేంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా? అని ఆరా తీశారు శ్యామల రావు. తిరుమల భక్తులకు రోజూ కొన్ని వేల మందికి భోజనం వండిండే వెంగమాంబ అన్నదాన సత్రంలో ఆయన భోజనం చేశారు. భోజనంలో నాణ్యత కొరవడిందలేదన్న విమర్శలు ఇటీవల వచ్చాయి. వసతి గృహాలు, లడ్డు కౌంటర్లను పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. దర్శనం, వసతి, నాణ్యమైన అన్నప్రసాదాలు, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలని వారికి సూచించారు. చేనేతమిత్ర మాసపత్రిక …
TTD EOగా జె శ్యామలరావు
తిరుపతి: తిరుమల, తిరుపతి దేవస్థానం నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జంజనం శ్యామలరావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన శ్యామలరావును ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ జూన్ 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. శ్యామలరావు ఇదివరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ముక్కుసూటిగా వ్యవహరించడంతోపాటు విధుల పట్ల నిబద్దత, చిత్తశుద్ధితో ఉంటారని గుర్తింపు పొందారు. గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేసి రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా చేశారు. ఐఏఎస్ 1997 బ్యాచ్‌కు చెందిన శ్యామలరావును మొదట అసోం క్యాడర్‌కు కేటాయించారు. 2009 – 2011 మధ్యకాలంలో విశాఖ కలెక్టర్‌గా, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ ఎండీగా కూడా పనిచేశారు. శ్యామలరావు మున్సిపల్ శాఖలో…
అట్టహాసంగా పేవా అనంతపురం జిల్లా కార్యవర్గ ఎన్నిక..
పద్మశాలీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఆదివారం (జూన్ 16న) జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని తపోవనంలో ఏర్పాటు చేసిన సంఘ సర్వసభ్య సమావేశంలో సభ్యులు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొంతం శివ రుదప్ర్ప, ప్రధాన కార్యదర్శిగా శీల వెంకటస్వా మి, కోశాధికారిగా బసపతి సురేష్ వ్యవహరించనున్నారు. కమిటీ కాలపరిమితి మూడు సంవత్సరాలు (2024 నుంచి 2027 వరకు). ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పేవా కడప జిల్లా అధ్యక్షులు గుణిశెట్టి శ్రీనివాసులు, ఎన్నికల పరిశీలకులుగా పేవా సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఊట్ల నరేంద్ర, పేవా రాష్ట్ర కోశాధికారి తాడూరు చందశ్రేఖర్ నూతన కమిటీని ప్రకటించారు. ఇదే సమావేశంలో మహిళా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేవా అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మఠం ప్రసన్న లక్ష్మి, కార్యదర్శిగా శీల…
నేతన్నల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం..
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గర్శకుర్తిలో ‘‘నేతన్న వెతలపై చర్చాగోష్టి’’ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆదివారం (జూన్ 17) చేనేత ఐక్య వేదిక మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిందం సునీత అధ్యక్షతన, వస్త్రోత్పత్తి వ్యాపారులు, కార్మిక, పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు. సమస్యలు సీఎం దృష్టికి.. ‘‘రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి చేతినిండా పని కరువైంది. 8 నెలలుగా పవర్ లూమ్స్ నుంచి వస్ర్త ఉత్పత్తులు నిలిచిపోయాయి. వాటి యజమానులు, కార్మికులను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తక్షణమే వారికి పనులు కల్పించాలి. అలాగే జియోట్యాగ్ విధానాన్ని రద్దు చేయాలి. త్రిప్ట్ పథకం కింద ఎనిమిది మాసాలుగా డబ్బులు జమకావడం లేదు. సంక్షోభంలో ఉన్న…
PEWA అనంతపురం జిల్లా నూతన కమిటీ ఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు
పద్మశాలీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (పేవా) అనంతపురం శాఖ సర్వసభ సమావేశం అనంతపురంలో జరగనుంది. మార్కండేయ స్వామి దేవస్థానం(తపోవనం)లో ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లా నూతన కమిటీ (2024 – 2027 ), మహిళా కమిటీని ఎన్నుకుంటారు. జిల్లా అధ్యక్షులు కొంతం శివ రుద్రప్ప తొలి పలుకులతో సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధాన కార్యదర్శి బసపతి సురేష్ బాబు ప్రగతి నివేదిక చదివి వినిపిస్తున్నారు. మెంబర్‌షిప్ డ్రైవ్, సభ్యత్వం పొందిన వారి సంఖ్య, సంఘం నిర్వహించిన కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరిస్తారు. అనంతరం ఆర్థిక నివేదికపై చర్చ ఉంటుంది. జమా ఖర్చుల వివరాలను సమావేశం ముందుంచుతారు. చివరగా నూతన కమిటీ (2024 – 2027 ) ఎన్నిక ఉంటుంది. ఎన్నికల అధికారిగా పేవా కడప జిల్లా అధ్యక్షులు డాక్టర్. గునిశెట్టి శ్రీనివాసులు, పరిశీలకులుగా సత్యసాయి…
కేంద్రీయ విద్యాలయాల్లోకి అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) నోటిఫికేషన్ కోసం తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం తమ వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ను సందర్శించాలని సూచించింది. Quantumai కేవీల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్…
