పద్మశాలి విద్యార్థులకు ఆర్థిక సాయం

చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి మెరుగైన ఫలితాలు సాధించిన 21 మంది విద్యార్థిని, విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. మార్కండేయ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టోత్సవానికి పంతం రవి దంపతులు రూ.51వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధిపేట పట్టణ పద్మశాలి సమాజం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్, ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బుర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసులు పాల్గొన్నారు. Striluxon

టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం..

చేనేతమిత్ర, హైదరాబాద్: మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ ఆ వస్త్రాల వెనుక దాగి ఉన్న వారి జీవిత కథ మాత్రం కష్టాల, కన్నీళ్ల కథగానే మిగిలిపోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత నేతన్నల దుస్థితిని గుర్తుచేస్తూ చెప్పిన మాటలు నేటికీ సజీవంగా వినిపిస్తున్నాయి: జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా – చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు ఈ ఒక్క వాక్యమే చేనేత కార్మికుల జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో చేనేత పరిశ్రమ అనేది వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ వృత్తి తరతరాలుగా కొనసాగుతోంది. తివాచీలు, బెడ్ షీట్లను తయారు చేసి…

నీలో ప్రాణం ఉన్నంతవరకు ప్రయత్నిస్తూనే ఉండు..!

నీలో ప్రాణం ఉన్నంతవరకు ప్రయత్నిస్తూనే ఉండు..! ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా బ్రతకడమే బరువైనా స్థితి గతులవి ఏవైనా చిరునవ్వులతో బ్రతకాలి ! చిరంజీవిగా బ్రతకాలి ! ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి ! నిరాశ నిస్పృహల నిశీధి నిండుగా అలుముకున్న సందర్భంలో సైతం పున్నమి వెన్నెల లా …. ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు రచించిన ఈ పాట మనిషి జీవితంలో… ఏ స్థాయిలో ఉన్నా … గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ఇలాంటి వాక్యాల స్ఫూర్తితోనే కోట దామోదర్ “అవరోధాలే అవకాశాలు” వ్యాస సంపుటి మన ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన వ్యాసకర్త కోట దామోదర్ రచించిన “అవరోధాలే అవకాశాలు” వ్యాస సంపుటి పాఠకులకు జీవితం పైన…

రేపు పద్మశాలీ సంఘం కార్తీక వనభోజన మహోత్సవం..

కర్నూలు: కర్నూలు జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీన(ఆదివారం) కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షులు కస్తూరి వేమయ్య, ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న, కోశాధికారి గుర్రం శివ ప్రసాద్​ తెలిపారు. కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని మాసా మసీదు పక్కనున్న ఎస్​ఎల్‌ఎన్​ ఫంక్షన్​ హాల్‌లో ఈ కార్యక్రమ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కులబాంధవులకు ఆహ్వానం.. కార్యక్రమ వివరాలను కస్తూరి వేమయ్య వివరిస్తూ.. ‘‘కార్తీక మాసంలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి నివాసం ఉండే ఉసిరి చెట్టు కింద శ్రీ హరి ప్రతిమకు ఉసిరికాయలు సమర్పించి, గోవింద నామాన్ని స్మరిస్తూ పూజ చేయడం వల్ల అన్ని శుభాలు జరుపుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలను కూడా ఉంచి ఆదివారం ఉదయం 8 గంటలకు…

రేపు కార్తీక వనభోజనాల సన్నాహక సమావేశం..

కర్నూలు: కర్నూలు నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో రేపు (అక్టోబర్ 5వ తేదీ) ఉదయం 10 గంటలకు కార్తీక వనభోజనాల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు కర్నూలు నగర పద్మశాలీ సంఘం అధ్యక్షులు కస్తూరి వేమయ్య తెలిపారు. నవంబరు 9వ తేదీన (ఆదివారం) వన భోజనాలు ఉంటాయని చెప్పారు. ఆలయంలో రేపటి సమావేశానికి కులబాంధవులంతా విచ్చేసి, వనభోజనాల కార్యక్రమ విజయవంతానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Clarté Finelya

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..

ఇటీవల మృతిచెందిన సిద్దిపేట జిల్లా కోహెడ మండల పద్మశాలి సేవా సంఘం సభ్యుడు వెల్దండి దామోదర్ కుటుంబానికి కులస్థులు అండగా నిలుస్తున్నారు. ఆయన కుమారుడు వెల్దండి సాయి కృష్ణకు గోవిందు రాజమౌళి రూ. 3,800 ఆర్థిక సాయం చేశారు. పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు కొండబత్తిని రాజలింగం, మాజీ అధ్యక్షులు గోవిందు సురేష్, కార్యదర్శి నరాల అశోక్, కోశాధికారి గాదాసు శ్రీనివాస్, సహాయ కోశాధికారి కొండ ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు గాజుల శంకర్, కొండబత్తిని సతీష్, నరాల శ్రీకాంత్, వడ్డేపల్లి రామకృష్ణ, వేముల శ్రీకాంత్, మడికొండ అనిల్, వడ్డేపల్లి ప్రవీణ్, ఇప్పలపల్లి శ్రీహర్ష, కొండ అక్షయ్.. దామోదర్ అల్లుళ్లు కొండబత్తిని శ్రీనివాస్, చాట్ల సతీష్‌తో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.   రెండు రోజుల క్రితం బియ్యం బస్తాల పంపిణీ.. వివరాలకు దిగువన ఉన్న ఫొటోపై క్లిక్…

పద్మశాలీ కుటుంబానికి చేయూత..

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కేంద్రానికి చెందిన పద్మశాలీ సేవా సంఘం సభ్యుడు వెల్దండి దామోదర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి సంతానం. పేద కుటుంబం కావడంతో కోహెడ పద్మశాలీ సేవా సంఘం దామోదర్ కుటుంబానికి అండగా నిలిచింది. 50 కిలోల బియ్యాన్ని వారికి అందజేసింది. బీసీ రాజ్యాధికారి సమితి ఉమ్మడి మెదక్ కన్వీనర్, పద్మశాలి సేవా సంఘం మాజీ అధ్యక్షులు గోవిందు సురేష్, కార్యదర్శి నరాల అశోక్, సహాయ కోశాధికారి కొండ ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు గాజుల శంకర్, కొండబత్తిని సతీష్, నరాల శ్రీకాంత్, వడ్డేపల్లి ప్రసాద్, వడ్డేపల్లి రామకృష్ణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. True Ledgewick

సహకారమే లక్ష్యం – ప్రగతే గమ్యం

ప్రసంగిస్తున్న PBN చైర్మన్ వర్కాల బాలాజీ

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిసారి నిర్వహించిన పద్మశాలీ బిజినెస్ నెట్‌వర్క్ (PBN) మీట్‌ విజయవంతమైంది. హనుమకొండ సమీపంలోని ”HOTEL THOUSAND PILLERS”లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి వివిధ వ్యాపారాలు చేస్తోన్న పద్మశాలీయులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు మార్కండేయ స్వామి పూజ.. అతిథులుగా తెలంగాణ పద్మశాలీ ఉద్యోగ సంఘం (TPUS) రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (NIMS) లైజనింగ్ ఆఫీసర్ మార్తా రమేష్, వరంగల్ పద్మశాలీ సంఘం అధక్షులు ఆడెపు రవీందర్, వ్యాపార వేత్త మైటీ సాగర్, మిమిక్రీ అర్టిస్టు బొమ్మ శ్రీనివాస్, లిమ్కా బుక్ రికార్డ్ హోల్డర్ బి. అశోక్ కుమార్ విచ్చేశారు. ప్రసంగిస్తున్న మార్త రమేష్ ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పద్మశాలీయులు పరస్పరం సహకరించుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాపారాలు…

ఆర్మూర్‌లో ఉపాధ్యాయులకు సన్మానం..

హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆర్మూర్ పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని పట్టణ పద్మశాలీ సంఘ భవనంలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకులు ముందుగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రాధాకృష్ణన్ జీవిత విశేషాలతో జింధం నరహరి రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడారు. సంఘ భవన నిర్మాణానికి సహాయ, సహకారాలు అందించిన కుల బాంధవులు, ప్రభుత్వ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించిన 30 మందికి శాలువ కప్పి మెమెంటోలను అందజేశారు. మహిళా కమిటీ ఆధ్వర్యంలో.. ఐదుగురు ఉపాధ్యాయులు – మామిడ్యాలా స్రవంతి, వంగ శ్రావణి, సాదుల మౌనిక, దోమల లావణ్య ప్రశాంత్ దంపతులను, బండారి కవిత శంకర్ దంపతులను పట్టణ…

పద్మశాలీ నిరుద్యోగ యువతకు ఫ్రీ ట్రైనింగ్..

ఇది ఫోటో కాప్షన్

హైదరాబాద్‌: కులాభిమానం ఉన్న వ్యక్తులు అరుదు. తమ కులస్థులను ప్రోత్సహించి, అవసరమైన సాయం చేసి.. జీవనానికి మార్గం చూపే వారు చాలా తక్కువ. తనతో పాటు తన కులస్థులు బాగుండాలని కాంక్షించే వ్యక్తుల్లో ఒకరైన పాపని హేమంత్ కుమార్.. కులస్థులకు సాయపడాలన్న తపనతో.. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ (ఫెయిల్/పాస్) అయిన పద్మశాలీ నిరుద్యోగ యువతకు ‘‘కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసింగ్’’ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన వారిని ప్రామాణికంగా తీసుకుని బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు.  హేమంత్ కుమార్ గురించి క్లుప్తంగా.. వందల మందికి ఉపాధి చూపిన పాపని హేమంత్ కుమార్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట గ్రామం. సత్యనారాయణ, దేవమ్మ దంపతులకు మూడో సంతానమైన హేమంత్‌కు అక్క, చెల్లి ఉన్నారు. హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక కంప్యూటర్ హార్డ్‌వేర్ నేర్చుకోవాలన్న…