Ampla Tesouròs
Category: తెలుసుకుందాం
ఏపీలో బీసీ కార్పొరేషన్లు – చైర్మన్లు
బీసీల అభ్యున్నతి కోసం ఆంధప్రదేశ్ ప్రభుత్వం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ల చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లను అక్టోబర్ 18వ తేదీ తాడేపల్లిలో ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకుగాను ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు. చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పించారు. కార్పొరేషన్ల చైర్మన్ల పేర్లు.. రజక కార్పొరేషన్: రంగన్న (అనంతపురం), కురుబ కార్పొరేషన్ : కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం), తొగట కార్పొరేషన్ : గడ్డం సునీత (అనంతపురం), కుంచిటి వక్కలిగ : డా.నళిని(అనంతపురం), వన్యకుల క్షత్రియ : కె. వనిత (చిత్తూరు), పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు), ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు), ఈడిగ: కె.శాంతి…
తెలుసుకుందాం రెవెన్యూ పదజాలం..
మనలో చాలామందికి రెవెన్యూ శాఖలో వాడే పదాల గురించి అవగాహన ఉండదు. పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్, భూ రికార్డుల్లో పొందుపరిచే కొన్ని పదాలకు అర్థాలను తెలుసుకుందాం. గ్రామ కంఠం: గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి. అసైన్డ్ భూమి: భూమిలేని పేదలు సాగు చేసుకునేందుకు, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు. ఆయకట్టు : ఒక నీటి వనరు కింద సాగయ్యే మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు. బంజరు భూమి (బంచరామి): గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం…
తెలంగాణా జిల్లాల కోడ్ నంబర్ లు
తెలంగాణా జిల్లాల కోడ్ నంబర్ లు జిల్లా పేరు – కోడ్ …………………………………………… . ఆదిలాబాద్ – TS 1 కరీంనగర్ – TS 2 వరంగల్ అర్బన్ – TS 3 ఖమ్మం – TS 4 నల్గొండ – TS 5 మహబూబ్‌నగర్ – TS 6 రంగారెడ్డి – TS 7 మేడ్చల్ – TS 8 హైదరాబాద్ – TS 9, 10, 11, 12, 13, 14 మెదక్, సంగారెడ్డి, పటాన్ చెరు.. TS 15 నిజామాబాద్ – TS 16 కామారెడ్డి – TS 17 నిర్మల్ – TS 18 మంచిర్యాల – TS 19 కొమరంభీమ్ – TS 20 జగిత్యాల – TS 21 పెద్దపల్లి – TS 22 రాజన్న సిరిసిల్ల –…
అర్హుల రేషన్ కార్డుల పునరుద్ధరణకు స్ప్లిట్ ఆప్షన్
కుటుంబసభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా.. ఇన్‌కంటాక్స్ చెల్లిస్తున్నా..4 చక్రాల వాహనం ఉన్నా..తడి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట 10 ఎకరాలు ఉన్నా.. 300 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లు విద్యుత్ వాడిన వారు తెల్లరేషన్ కార్డు పొందేందుకు అనర్హులు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన నవశకం సర్వే ద్వారా కొందరి అర్హుల రేషన్‌కార్డులు అనర్హుల జాబితాలోకి వెళ్లాయి. స్ల్పిట్ ఆప్షన్ ద్వారా వాటిని తిరిగి పునరుద్ధరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ వివరాలు సాక్షి దినపత్రిక సౌజన్యంతో పాఠకుల కోసం.. Nový Kapitstav SPLIT OPTION TO RATION CARD HOLDERS
క్రెడిట్ కార్డు సైజులో ఆధార్.. దరఖాస్తు చేసుకోండి ఇలా ..
ఆధార్ కార్డు డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్సు లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్ క్లోరైడ్ (పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్‌ను పొందొచ్చు. పది రోజుల్లో కొత్త ఆధార్ కార్డు మీ ఇంటికి చేరుతుంది. క్రెడిట్ కార్డు సైజులో ఆధార్.. అప్లై ఇలా.. ◆ పీవీసీ ఆధార్ కార్డు అప్లయ్ చేసేందుకు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి ◆ గెట్ ఆధార్ అనే చోట Order Aadhaar PVC Card అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ◆ అక్కడ మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆధార్ కార్డు తాలూకా…
SBI BUMPER OFFER TO GOVT EMPLOYEES
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై)
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై) ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై) భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రమాద బీమా పథకం. బీమా చేయని జనాభాను బీమా పరిధిలోకి తీసుకురావడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకంలో సంవత్సరానికి రూ .12 / – మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఈ పథకానికి 18-70 సంవత్సరాల వయస్సులోపు ఉండి బ్యాంకులో పొదుపు ఖాాతా ఉండాలి. ఈ పథకాన్ని ఏటా పునరుద్ధరించవచ్చు. ఇది బలహీన వర్గాలకు తక్కువ ధర గల పాలసీ. వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి బీమా సంస్థ డబ్బు చెల్లిస్తుంది. బీమా యోజన అర్హత – కవరేజ్ ఏదైనా ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ. 2 లక్షలు ఇస్తారు. శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ . 2 లక్షలు చెల్లిస్తారు. పాక్షిక వైకల్యం సంభవిస్తే…