గుండెకు చిల్లులు .. ఆర్థిక సాయం కోసం వేడుకోలు

రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో ఆ దంపతులు  చాలా ఆనంద పడ్డారు. ఇంటిల్లిపాది సంతోషించారు. సరిగ్గా మూడు మాసాలకు డాక్టర్లు చెప్పిన మాట ఆ కుటుంబాన్ని కుదిపేసింది. మీ పిల్లవాడికి గుండెలో రంధ్రాలు ఉన్నాయని చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు. కన్నపేగును కాపాడుకోవాలని చాలా ఆసుపత్రులకు వెళ్లారు. వైద్యులు  సూచించిన పరీక్షలకు వేల రూపాయలు  చెల్లించారు. ఆపరేషన్‌కు లక్షల రూపాయలు  ఖర్చవుతుందని తెలిసి కొడుకు ప్రాణాల కోసం అప్పు చేశారు. రెండోసారి ఆపరేషన్‌ చేయాల్సి రావడంతో డబ్బు అవసరమైంది. పేద కుటుంబం కావడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలకేంద్రానికి చెందిన మైలారు సురేష్‌, అరుణమ్మ దంపతులకు మగ్గమే జీవనాధారం. చీరె నేస్తేగాని పూట గడవని పరిస్థితి. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. మొదటి…