పద్మశాలి ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం

దుబ్బాక మున్సిపల్ చైర్‌పర్సన్‌ శ్రీరామ్ సంగీత రవీందర్

చేనేతమిత్ర, సిద్ధిపేట: ఇటీవల జరిగిన మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన ప్రజాప్రతినిధులను సిద్ధిపేట జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు సన్మానించారు. స్థానిక పద్మశాలి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన శ్రీరామ్ సంగీత రవీందర్, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని కౌన్సిలర్లు, జిల్లాలో ఎన్నికైన సర్పంచులకు సంఘ సభ్యులు శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న పద్మశాలియులు రాజకీయాల్లోనూ రాణించాలని కోరారు. ఎన్నికయిన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బుర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసులు, దూడం ఆగయ్య, వంగరి శ్రీశైలం, కృష్ణ, దయాసాగర్, కాముని రాజేశం, గోనె మార్కండేయ, చిప్ప ప్రభాకర్, శ్రీధర్, చేర్యాల వెంకన్న, రవితేజ బాలకిషన్…

టీజీ భరత్‌కు పద్మశాలీయుల సన్మానం

కర్నూలు : కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను కర్నూలు నగర పద్మశాలీ సంఘం సన్మానించనుంది. నేడు (28.6.2024 శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు మౌర్య ఇన్ హోటల్ పరిధిలోని తన కార్యాలయంలో టీజీ భరత్‌ను కలిసి అభినందనలు తెలపనున్నామని కర్నూలు నగర పద్మశాలీ సంఘం అధ్యక్షులు కస్తూరి వేమయ్య తెలిపారు. కమిటీ సభ్యులు, పద్మశాలీ కులబాంధవులు ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఆయన కోరారు. టీజీ భరత్ గురించి క్లుప్తంగా.. కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్.  1977లో జన్మించిన  భరత్ యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ  పూర్తి చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో తండ్రి అడుగుజాడల్లో నడిచారు. వ్యాపారంలో తండ్రికి…

కోట దామోదర్‌కు ‘తెలుగు వెలుగు లెజండరీ’ పురస్కారం

 చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌రచయిత, కాలమిస్ట్ ‌కోట దామోదర్‌కు అరుదైన గౌరవం దక్కింది. పత్రిక వ్యాసరచన రంగంలో ఆయన ‘తెలుగు వెలుగు లెజండరీ’ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు వెలుగు సాహితీ వేదిక ఇటీవల హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గాన సభ, కళా దీక్షితులు కళా వేదిక చిక్కడపల్లిలో తెలుగు వెలుగు జాతీయ పురస్కారాల మహోత్సవం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాచకొండ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌రావుల గిరిధర్‌, అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ అఫ్‌ ‌పోలీస్‌, ‌స్టేషన్‌ ‌ఘన్‌ ‌పూర్‌ ‌దురిశెటీ రఘుచందర్‌, ‌సరస్వతి మాత ఉపాసకులు దైవజ్ఞ శర్మ, కవి రచయిత నేదునూరి కనకయ్య, పలువురు ప్రముఖులు విచ్చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలోని వివిధ రంగాల నుంచి ఎంపిక చేసిన పలువురికి ముఖ్యఅతిథులు అవార్డులను అందజేశారు. ఈ…

చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాస రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాస రావు జన్మదినం (జూలై6) సందర్భంగా పలువురు నాయకులు, పట్టణ ప్రముఖులు, అభిమానులు, ప్రజలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవాంగ కార్పోరేషన్‌ చైర్మన్‌ బీరక సురేంద్ర, జాతీయ బీసీ సంక్షేమ సంఘం చీరాల చీరాల నియోజకవర్గ అధ్యక్షుడు గుంటి శ్రీనివాస రావు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ యువనేత కరణం వెంకటేష్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ వరికూటి అమృతపాణి, ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ పి. శ్రీకాంత్‌, చీరాల వన్‌ టౌన్‌ సీఐ అంబటి రాజు మోహన్‌, కాంగ్రెస్‌ పార్టీ చీరాల కన్వీనర్‌ అలీం బాబు, హ్యూమన్‌ రైట్స్ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ డిస్ట్రిక్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ అవ్వారు వెంకటేష్‌ బాబు, ఏపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి బత్తుల అమిత్‌…

డాక్టర్‌ వై. నరసింహులు పదవీ విరమణ

ప్రాంతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌గా రిటైర్‌మెంట్‌ చిన్నపిల్లల డాక్టర్‌గా సుపరిచితులు డీఎంహెచ్‌వోగానే ప్రజల్లో గుర్తింపు మాట కఠినం. మనసు సున్నితం. నిజాయితీ ఆయన ఆయుధం. అవినీతికి బద్ధ వ్యతిరేకి. ముక్కుసూటితనం ఆయన నైజం. విధుల్లో అంకిత భావం, ఒత్తిళ్లకు లొంగని ధైర్యం ఆయన సొంతం. ఆయనే డాక్టర్‌ యంగల నరసింహలు. మూడుసార్లు  డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం ఆర్‌హెచ్‌ఎఫ్‌డబ్ల్యూటీసీ ప్రిన్సిపాల్‌గా జూన్‌ 30వ తేదీ పదవీ విరమణ చేశారు. ఆయన గురించి క్లుప్తంగా.. డాక్టర్‌ యంగల నరసింహులు సొంతూరు కర్నూలు జిల్లాలోని కోసిగి గ్రామం. నారాయణమ్మ, పెద్ద కోసిగయ్య దంపతులకు 1958 జూన్‌ 20వ తేదీన జన్మించారు. నరసింహులుకు అన్న యంగల ఆంజనేయ, అక్క శకుంతల ఉన్నారు. బాల్యం, విద్యాభ్యాసం.. నరసింహులు బాల్యం, విద్యాభ్యాసమంతా కోసిగిలో జరిగింది. 1 నుంచి 5వ తరగతి…

మహిళాభివృద్ధే సమాజాభివృద్ధి – ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించినపుడే సమాజాభివృద్ధి జరిగినట్లని కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మార్చి 5వ తేదీ ఆమె కర్నూలు నగరంలో పర్యటించారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 19వ వార్డులో వైసీపీ అభ్యర్థి బీవై రామయ్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నిబెట్టుకున్నారని తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందినట్లని నమ్మిన వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా సౌకర్యాలు సమకూర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. కార్పొరేటర్‌ అభ్యర్థి రామయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి…

న్యూ ఇయర్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ – కుర్ణి, కరికాల భక్తుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌, డైరెక్టర్లను సన్మానించిన సంఘం నాయకులు

కుర్ణి సంక్షేమ సంఘం నూతన సంవత్సరం – 2021 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 3వ తేదీ కర్నూలు జిల్లా కేంద్రం కల్లూరులోని ఆదిత్య పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుర్ణి, కరికాల భక్తుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌, డైరెక్టర్లను సన్మానించారు. కుర్ణి సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు బందికే వాసు దేవయ్య సభకు అధ్యక్షత వహించారు. రాష్ట్ర కుర్ణి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాదుగుండు కృష్ణయ్య కార్పొరేషన్‌ కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. అనంతరం కుర్ణి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాస్‌ మాట్లాడుతూ చేనేతలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన చేనేతలందరికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని చైర్‌పర్సన్‌, డైరెక్టర్లను విజ్ఞప్తి చేశారు. సంఘం ఉపాధ్యక్షులు సిబీ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌…

అభ్యుదయ చేనేత సమాజానికి కృషి చేస్తా: పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌

చేనేత సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఆంధప్రదేశ్‌ పద్మశాలీ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి బీసీల పట్ల ఎంతో అభిమానం ఉందన్నారు. చేనేతలకు విడివిడిగా 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం..నేత కార్మికుల పట్ల ఆయనకు ఉన్న ప్రత్యేక అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌, డైరెక్టర్లను గుంటూరు జిల్లా, నగర పద్మశాలీ సంక్షేమ సంఘం నాయకులు నవంబర్‌ 29వ తేదీన గుంటూరులోని ప్రగడకోటయ్య భవన్‌లో సన్మానించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనుముల నాగ ప్రసాద రావు స్వాగతోపన్యాసం చేశారు. వెంకటగిరికి చెందిన మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ మాడా జానకిరామయ్య భావనారుషి స్తోత్రము పఠన అందరిని ఆకట్టుకుంది. ప్రజాబంధు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి…

చైర్‌పర్సన్‌కు ఆత్మీయ సన్మానం

ఆంధప్రదేశ్‌ పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మిని కడప జిల్లాలోని పద్మశాలీ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. నవంబర్‌ 22వ తేదీ సాయంత్రం ప్రొద్దుటూరు గాంధీరోడ్‌లోని పద్మశాలీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి, జింకా విజయలక్ష్మి విచ్చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు కళ్యాణ మండపం, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలీ సంఘం, కడప జిల్లా పద్మశాలీ సంఘం, పట్టణ పద్మశాలీ సంఘం, పద్మశాలీ అభ్యుదయ సంఘం, రామేశ్వరం శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి దేవస్థానం, రామేశ్వరం పద్మశాలీ భవన్‌, గాంధీరోడ్‌ పద్మశాలీ సంఘం, శ్రీరామనగర్‌ భద్రావతి భావనారాయణ స్వామి దేవస్థానం, కళ్యాణమండపం నిర్వాహకులు పాల్గొన్నారు. ఇటీవల పుట్టపర్తి పద్మశాలీ సంఘం నాయకులు జింకా విజయలక్ష్మిని సన్మానించారు. ఆమెకు పుష్పగుచ్చం అందజేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. website : www.chenetamitra.com whatsapp…

పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌కు అభినందనలు

ఆంధప్రదేశ్‌ పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌, అడ్వకేట్‌ జింకా విజయలక్ష్మికి ఏపీ పద్మశాలీ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. నవంబర్‌ 18వ తేదీన ప్రొద్దుటూరులో సంఘం సహఅధ్యక్షులు కేఎస్‌ చక్రధారి, ప్రధాన కార్యదర్శి నాగమల్ల విశ్వప్రసాద్‌, ఉపాధ్యక్షులు నాగమల్ల శంకర్‌, సహాయ కార్యదర్శి దేవానంద్‌ ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా చక్రధారి మాట్లాడుతూ చేనేతలు, బీసీల మీద ఉన్న అభిమానంతో వారి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. చేనేతల సమస్యలను చైర్‌పర్సన్‌ దృషికి తీసుకెళ్లారు. వారి అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చైర్‌పర్సన్‌ వారికి హామీ ఇచ్చారు. Nový Kapitstav