చేనేతమిత్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలో జరగనుంది. మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని విభాగాల నూతన కార్యవర్గ సభ్యులు 26 జిల్లాల నుంచి హాజరుకానున్నట్లు రాష్ట్ర సంఘ నూతన అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు తెలిపారు. అఖిల భారత పద్మశాలీ (ABPS) సంఘానికి అనుబంధంగా ఈ కమిటీ పనిచేయనుంది. ‘కార్యక్రమాన్ని జయపద్రం చేయాలని మనవి..’ ‘‘అఖిల భారత పద్మశాలీ సంఘానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశాం. నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరుగుతుంది. యువజన విభాగం, మహిళా విభాగం, చేనేత విభాగాల కార్యవర్గ సభ్యులు…
Category: పదవి
TTD EOగా జె శ్యామలరావు
తిరుపతి: తిరుమల, తిరుపతి దేవస్థానం నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జంజనం శ్యామలరావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన శ్యామలరావును ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ జూన్ 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. శ్యామలరావు ఇదివరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ముక్కుసూటిగా వ్యవహరించడంతోపాటు విధుల పట్ల నిబద్దత, చిత్తశుద్ధితో ఉంటారని గుర్తింపు పొందారు. గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేసి రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా చేశారు. ఐఏఎస్ 1997 బ్యాచ్‌కు చెందిన శ్యామలరావును మొదట అసోం క్యాడర్‌కు కేటాయించారు. 2009 – 2011 మధ్యకాలంలో విశాఖ కలెక్టర్‌గా, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ ఎండీగా కూడా పనిచేశారు. శ్యామలరావు మున్సిపల్ శాఖలో…
అట్టహాసంగా పేవా అనంతపురం జిల్లా కార్యవర్గ ఎన్నిక..
పద్మశాలీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఆదివారం (జూన్ 16న) జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని తపోవనంలో ఏర్పాటు చేసిన సంఘ సర్వసభ్య సమావేశంలో సభ్యులు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొంతం శివ రుదప్ర్ప, ప్రధాన కార్యదర్శిగా శీల వెంకటస్వా మి, కోశాధికారిగా బసపతి సురేష్ వ్యవహరించనున్నారు. కమిటీ కాలపరిమితి మూడు సంవత్సరాలు (2024 నుంచి 2027 వరకు). ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పేవా కడప జిల్లా అధ్యక్షులు గుణిశెట్టి శ్రీనివాసులు, ఎన్నికల పరిశీలకులుగా పేవా సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఊట్ల నరేంద్ర, పేవా రాష్ట్ర కోశాధికారి తాడూరు చందశ్రేఖర్ నూతన కమిటీని ప్రకటించారు. ఇదే సమావేశంలో మహిళా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేవా అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మఠం ప్రసన్న లక్ష్మి, కార్యదర్శిగా శీల…
జాతీయ చేనేత ఐక్యవేదిక కన్వీనర్ల నియామకం
జాతీయ చేనేత ఐక్యవేదిక నియోజక కన్వీనర్ల నియామకం ఇటీవల జరిగింది. శింగనమల నియోజకవర్గ కన్వీనర్‌గా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం కేకే అగ్రహారం గ్రామానికి చెందిన గిద్దలూరు రవి, ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ కన్వీనర్ గా యర్రా నాగేష్ బాబు, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్‌గా మాన్యం అచ్చయ్యను నియమించారు. వీరికి ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ నీలూరి రుషింగప్ప నియామక పత్రాలు పంపారు. కొత్త కన్వీనర్లు తమ పరిధిలో చేనేత వర్గాల సమస్యలను తెలుసుకుని వాటిని తమ దృష్టికి తేవాలని, చేనేత సమాజానికి చెందిన వారిలో అర్హులంతా సంక్షేమ పథకాలు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. తమను కన్వీనర్లుగా నియమించినందుకు కొత్త కన్వీనర్లు ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, రుషింగప్పకు ధన్యవాదాలు తెలిపారు. website : www.chenetamitra.com whatsapp Number: 83338 71117 e…
జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాసిన రామకృష్ణ – మరో ఇద్దరు కన్వీనర్ల నియామకం
జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాసిన రామకృష్ణను నియమించారు. వీరు విజయనగరం జిల్లాకేంద్రం రింగ్‌రోడ్డు వీధికి చెందిన వారు. ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలకు ఇటీవల కన్వీనర్లను నియమించారు. వారికి రాష్ట్ర కన్వీనర్ నీలూరి రుషింగప్ప నియామక పత్రాలు పంపారు. ఉరవకొండ నియోజకవర్గ కన్వీనర్‌గా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన గన్నే ఎర్రిస్వామిని, విశాఖ జిల్లాకు కన్వీనర్‌గా విశాఖపట్టణం మురళీనగర్‌కు చెందిన ఎవివిఎస్ మూర్తి (బాదంగిరిసాయి)ని నియమించారు. కొత్త కన్వీనర్లు తమ పరిధిలో చేనేత వర్గాల సమస్యలను తెలుసుకుని వాటిని తమ దృష్టికి తేవాలని సూచించారు. చేనేత సమాజానికి చెందిన వారిలో అర్హులంతా సంక్షేమ పథకాలు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. తమను నియమించినందుకు జాతీయ చేనేత ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, రాష్ట్ర కన్వీనర్ రుషింగప్పకు కన్వీనర్లు ధన్యవాదాలు…
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్, కోకన్వీనర్ల నియామకం – వివరాలు వెల్లడించిన జాతీయ చేనేత ఐక్యవేదిక
జాతీయ చేనేత ఐక్యవేదిక ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్, కోకన్వీనర్లను నియమించింది. నియామక పత్రాలను ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ నీలూరి రుషింగప్ప విడుదల చేశారు. కొత్తగా నియమితులైన కన్వీనర్, కో కన్వీనర్లు తమ పరిధిలో చేనేత వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని తమ దృష్టికి తేవాలని రుషింగప్ప సూచించారు. కేంద్ర కార్యవర్గం నిర్ణయం మేరకు వాటిని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. చేనేత సమాజానికి చెందిన వారిలో అర్హులంతా సంక్షేమ పథకాలు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. జాతీయ చేనేత ఐక్యవేదిక పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్‌గా భీమవరం మండలం ఆగడాలలంకకు చెందిన గోలిసుబ్బారావు, నరసాపురం పార్లమెంటు కన్వీనర్‌గా భీమవరం మండలం చినఅమిరం గ్రామానికి చెందిన వరద నాగరాజు, కో కన్వీనర్‌గా పాలకొల్లు మండలం దిగమర్రు…
బీసీ ఉపాధ్యాయ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాపోలు పరమేష్
బీసీ ఉపాధ్యాయ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నల్గొండ జిల్లా అల్వాల ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాపోలు పరమేష్‌ను నియమించారు.ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకర శ్రీనివాస్ రావు, తాళ్ల పల్లి సురేష్ సోమవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ బీసీ ఉపాధ్యాయ సంఘం బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కొన్నే శంకర్ గౌడ్, నల్లమేకల వెంకయ్య, నిజామాబాద్ అధ్యక్షులు వినోద్, వరంగల్ అధ్యక్షులు ప్రవీణ్, బీరప్ప, గోపాల కృష్ణ, కోలా సైదులు ముదిరాజ్, గంగ పుత్ర సైదులు, మారం శ్రీనివాస్, వడ్డేపల్లి వెంకటేష్ రాపోలు పరమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.…
జాతీయ చేనేత ఐక్యవేదిక ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్‌గా వర ప్రసాద రావు
జాతీయ చేనేత ఐక్యవేదిక తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి కన్వీనర్‌గా ఆండ్ర వర ప్రసాద రావును నియమించారు. ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ నీలూరి రుషింగప్ప సూచనమేరకు ఈ నియామకం చేపట్టినట్లు జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర ప్రసాద రావు తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండల కేంద్రానికి చెందిన వారు. తనను ఎంపిక చేసిన జాతీయ, రాష్ట్ర కన్వీనర్‌లకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘చేనేతమిత్ర’తో వరప్రసాద్ మాట్లాడుతూ చేనేతలలో రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. చేనేత రంగానికి చెందిన వారు ప్రజా ప్రతినిధులయితే నేత కార్మికుల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ఒత్తిడి తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. తన పరిధిలో చేనేతల సమస్యలను జాతీయ చేనేత ఐక్యవేదిక దృష్టికి తీసుకెళ్లి…
జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షులుగా ఊట్ల రమేష్ బాబు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఊట్ల రమేష్ బాబు ఎన్నికయ్యారు. నవంబర్ 16వ తేదీ కర్నూలులో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు మురళీ మనోహర్ నియామక పత్రాన్ని రమేష్‌కు అందజేశారు. ఊట్ల రమేష్ బాబు గురించి.. కర్నూలు నగరం పాతబస్తీకి చెందిన ఊట్ల రమేష్ బాబు మాణిక్యమ్మ, మార్కండేయుడి దంపతులకు రెండో సంతానం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. పద్మశాలీ కులస్థులు. కర్నూలు కొత్తపేటలోని బాలశివ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చాలా సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు కర్నూలు పట్టణ పద్మశాలీ సంఘానికి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 2016 నుంచి 2018 వరకు కర్నూలు నగర పద్మశాలీ…