బీసీ ఉపాధ్యాయ సంఘం స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రాపోలు పరమేష్‌

బీసీ ఉపాధ్యాయ సంఘం స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నల్గొండ జిల్లా అల్వాల ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాపోలు పరమేష్‌ను నియమించారు.ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకర శ్రీనివాస్‌ రావు, తాళ్ల పల్లి సురేష్‌ సోమవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పరమేష్‌ మాట్లాడుతూ బీసీ ఉపాధ్యాయ సంఘం బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కొన్నే శంకర్‌ గౌడ్‌, నల్లమేకల వెంకయ్య, నిజామాబాద్‌ అధ్యక్షులు వినోద్‌, వరంగల్‌ అధ్యక్షులు ప్రవీణ్‌, బీరప్ప, గోపాల కృష్ణ, కోలా సైదులు ముదిరాజ్‌, గంగ పుత్ర సైదులు, మారం శ్రీనివాస్‌, వడ్డేపల్లి వెంకటేష్‌ రాపోలు పరమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. Ampla Tesouròs

Follow us on social media

Related posts

Leave a Comment