అనంతపురం జిల్లా నుంచి ఎంపికయిన బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లకు నవంబర్ 3వ తేదీ అంబేద్కర్ భవన్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ అభినందన సభలో రాష్ట్ర కుర్ని/కరికాల భక్త కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మంజుల కోదండరామ్‌లను రోడ్లు భవనాలు శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, ఉరవకొండ మాజీ శాసన సభ్యులు వై విశ్వేశ్వర రెడ్డి హాజరై సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాలోని 14 మంది శాసన సభ్యులు, ఇద్దరు ఎంపీలు, జిల్లా 4 కార్పొరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్లు, జిల్లాలోని వివిధ నియోజకవర్గ కుర్ని సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇటీవల బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. కుర్ణి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బుట్టా శారదమ్మ కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అదే సందర్భంలో బుట్టా శారదమ్మకు వైసీపీ నాయకులు కోదండరాం శుభాకాంక్షలు తెలిపారు. Ampla Tesouròs


