ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర సంఘ నూతన అధ్యక్షుడిగా జీవి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అధ్యక్షుడితో పాటు ఎంపికయిన కార్యవర్గ సభ్యులతో అఖిల భారత పద్మశాలీ సంఘం (ABPS) ప్రధాన కార్యదర్శి జగన్నాథం ప్రమాణం చేయించారు. ‘‘ఐక్యతతోనే రాజ్యాధికారం..’’ ‘‘పద్మశాలి సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలి. ఎంతో ఘన చరిత్ర కలిగిన పద్మశాలీయులు నేటికీ సరైన రాజకీయ ప్రాధాన్యం లేదు. రాజకీయాల్లోనూ రాణించాలి. ఐక్యతతో మెలిగి హక్కుల కోసం పోరాడాలి. పట్టుదలతో పోరాడితేనే ఏదైనా సాధ్యమే.’’ – కందగట్ల స్వామి, ABPS అధ్యక్షులు సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం మాట్లాడుతూ…
Category: ముఖ్య సమాచారం
పద్మశాలి ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం
చేనేతమిత్ర, సిద్ధిపేట: ఇటీవల జరిగిన మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన ప్రజాప్రతినిధులను సిద్ధిపేట జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు సన్మానించారు. స్థానిక పద్మశాలి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన శ్రీరామ్ సంగీత రవీందర్, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని కౌన్సిలర్లు, జిల్లాలో ఎన్నికైన సర్పంచులకు సంఘ సభ్యులు శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న పద్మశాలియులు రాజకీయాల్లోనూ రాణించాలని కోరారు. ఎన్నికయిన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బుర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసులు, దూడం ఆగయ్య, వంగరి శ్రీశైలం, కృష్ణ, దయాసాగర్, కాముని రాజేశం, గోనె మార్కండేయ, చిప్ప ప్రభాకర్, శ్రీధర్, చేర్యాల వెంకన్న, రవితేజ బాలకిషన్…
‘విద్యార్థుల యూనిఫాంలను టెస్కో ద్వారా మాత్రమే కొనాలి’
చేనేతమిత్ర, హైదరాబాద్: గురుకులల్లో విద్యార్థులకు యిచ్చే ఉచిత యూనిఫాంలను టెస్కో(తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ (A.I.W.F) తెలంగాణ రాష్ట్ర నాయకులు చేనేత, జౌళిశాఖ ముఖ్యకార్యదర్శి శైలజ రామయ్యర్‌కు వినతిపత్రం అందజేశారు. చేనేత దుప్పట్లు, బెడ్‌షీట్లు, టవాళ్లను టెస్కోద్వారా కాకుండా టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయాన్ని సమాఖ్య నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. చేనేత కార్మికుల ఇబ్బందులను శైలజ రామయ్యర్‌కు వివరించారు. దీంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. మహాత్మ జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTGBCWREIS) కార్యదర్శి సైదులును కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శి…
నేడు రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
చేనేతమిత్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలో జరగనుంది. మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని విభాగాల నూతన కార్యవర్గ సభ్యులు 26 జిల్లాల నుంచి హాజరుకానున్నట్లు రాష్ట్ర సంఘ నూతన అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు తెలిపారు. అఖిల భారత పద్మశాలీ (ABPS) సంఘానికి అనుబంధంగా ఈ కమిటీ పనిచేయనుంది. ‘కార్యక్రమాన్ని జయపద్రం చేయాలని మనవి..’ ‘‘అఖిల భారత పద్మశాలీ సంఘానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశాం. నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరుగుతుంది. యువజన విభాగం, మహిళా విభాగం, చేనేత విభాగాల కార్యవర్గ సభ్యులు…
కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం..
చేనేతమిత్ర: జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఆగస్టు 7) పురస్కరించుకొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు అవార్డులను ప్రదానం చేయనుంది. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ సంచాలకులు శైలజా రామయ్యర్ ఒక ప్రకటనలో కోరారు. చేనేత వృత్తిలో ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అవార్డుకు ఎంపికైన వారికి రూ.25 వేలు నగదు పురస్కారంతోపాటు ప్రశంసపత్రం, జ్ఞాపక అందజేస్తారని పేర్కొన్నారు. చేనేత కళాకారులు 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయసు ఉండి, 10 సంవత్సరాల అనుభవం ఉండాలని, అలాగే చేనేత డిజైనర్లు 31.12.2025 నాటికి 25 సంవత్సరాల వయసు పూర్తయి ఐదేళ్ల అనుభవం ఉన్న వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. అర్హులు మార్చి 31లోపు తమ దరఖాస్తులను ఆయా జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ…
అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
చేనేతమిత్ర ప్రతినిధి: అనంతపురం జిల్లా పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జింకా సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పోతుల లక్ష్మీనరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాయలసీమ ప్రాంత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కొంకతి లక్ష్మీనారాయణ హాజరై నూతన అధ్యక్ష, కార్యదర్శుల పేర్లను ప్రతిపాదించారు. అనంతపురం పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవరకొండ నరసింహులు, రాయదుర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు అరవ శివప్ప, కళ్యాణదుర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకటేశులు, గుంతకల్లు పద్మ శాలి సంఘం అధ్యక్షుడు పాలాది రామసుబ్బయ్య, తాడిపత్రి పద్మశాలి సంఘం సభ్యులు, ఉరవకొండ పద్మశాలి సంఘం సభ్యులు, యాడికి పద్మశాలి సంఘం సభ్యులు, బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘం సభ్యులు, సిండికేట్ నగర్ పద్మ శాలి సంఘం సభ్యులు, గుంతకల్లు పద్మశాలి సంఘం సభ్యులు,…
తెలంగాణలో 2,996 వార్డులకు 28,456 నామినేషన్లు..
చేనేతమిత్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి రోజు 30వ తేదీన భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మొత్తం 2,996 వార్డులకు మూడు రోజులు కలిపి 28,456 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపాలిటీ 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీమతి సామల ప్రసన్న సత్యపాల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు పట్టణంలో 45 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన…
2న బీసీ కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
చేనేతమిత్ర ప్రతినిధి (హైదరాబాద్): రాష్ట్రంలో బీసీ (Backward Classes) వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కులు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చించేందుకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ కుల సంఘాల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. బీసీ మేధావుల ఫోరమ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ, వారికి తగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాతినిధ్యం లభించడం లేదని బీసీ సంఘాలు నేతలు గత కొంతకాలంగా విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీలు సరైన స్థానం ఇవ్వకపోవడం వల్ల బీసీ వర్గాలు నష్టపోతున్నాయని అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌లో బీసీలకు నిజంగా ఎంత న్యాయం జరుగుతోంది? లెక్కల వెనుక దాగిన మోసాలు ఏమిటి? బీసీ నిధులు…
చేనేతలకు ఇచ్చిన హామీల అమలుకు డేట్ ఫిక్స్..
చేనేతమిత్ర ప్రతినిధి: నిజంగా ఇది చేనేతలకు శుభవార్తే. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 ఆగస్టు 7న నేతన్నలకు ఇచ్చిన హామీలు ఏప్రిల్ 1 నుంచి అమలు కాబోతున్నాయి. అసలు అవేంటో చూద్దాం.. రాష్ట్రంలోని 93 వేల చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పవర్ లూమ్ ఉన్న 50 వేల కుటుంబాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఆప్కో చేనేత సహకార సంఘాలకు బకాయిల చెల్లింపు – రూ.7.5 కోట్లు విడుదల త్రిప్టు ఫండ్ పథకం కింద దాదాపు రూ. 1.60 కోట్లు విడుదల చేనేతలకు ఉపాధి కోసం విశాఖలో ఐదు ఎకరాల్లో.. రూ. 172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మాణం మంగళగిరిలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు…
నేడు భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణోత్సవం
కర్నూలు: శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం, నేడు అంగరంగ వైభంగా జరగనుంది. కర్నూలు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో, ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే పద్మశాలీ ప్రముఖులు, నగర అధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పార్లమెంట్ కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, ప్రముఖ ఆర్థోపెడీసియన్ డాక్టర్ అచ్యుతరావు, రాయలసీమ యూనివర్సటీ వైస్ చాన్స్‌లర్ ఊడత వెంకట బసవరావు, డీఐజీ కోయ ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్, బీజేపీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు పోలంకి రామస్వామి, ప్రధాన కార్యదర్శి నారాయణ నాగేశ్వరావుకు ఆహ్వానపత్రికలు అందజేశారు. కళ్యాణోత్సవంలో భాగంగా చిత్తారి వీధిలోని ఆలయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు శోభయాత్ర…


