ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర సంఘ నూతన అధ్యక్షుడిగా జీవి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అధ్యక్షుడితో పాటు ఎంపికయిన కార్యవర్గ సభ్యులతో అఖిల భారత పద్మశాలీ సంఘం (ABPS) ప్రధాన కార్యదర్శి జగన్నాథం ప్రమాణం చేయించారు. ‘‘ఐక్యతతోనే రాజ్యాధికారం..’’ ‘‘పద్మశాలి సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలి. ఎంతో ఘన చరిత్ర కలిగిన పద్మశాలీయులు నేటికీ సరైన రాజకీయ ప్రాధాన్యం లేదు. రాజకీయాల్లోనూ రాణించాలి. ఐక్యతతో మెలిగి హక్కుల కోసం పోరాడాలి. పట్టుదలతో పోరాడితేనే ఏదైనా సాధ్యమే.’’ – కందగట్ల స్వామి, ABPS అధ్యక్షులు సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం మాట్లాడుతూ…
Category: తెలంగాణ
పద్మశాలి ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం
చేనేతమిత్ర, సిద్ధిపేట: ఇటీవల జరిగిన మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన ప్రజాప్రతినిధులను సిద్ధిపేట జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు సన్మానించారు. స్థానిక పద్మశాలి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన శ్రీరామ్ సంగీత రవీందర్, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని కౌన్సిలర్లు, జిల్లాలో ఎన్నికైన సర్పంచులకు సంఘ సభ్యులు శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న పద్మశాలియులు రాజకీయాల్లోనూ రాణించాలని కోరారు. ఎన్నికయిన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బుర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసులు, దూడం ఆగయ్య, వంగరి శ్రీశైలం, కృష్ణ, దయాసాగర్, కాముని రాజేశం, గోనె మార్కండేయ, చిప్ప ప్రభాకర్, శ్రీధర్, చేర్యాల వెంకన్న, రవితేజ బాలకిషన్…
పద్మశాలి విద్యార్థులకు ఆర్థిక సాయం
చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి మెరుగైన ఫలితాలు సాధించిన 21 మంది విద్యార్థిని, విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. మార్కండేయ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టోత్సవానికి పంతం రవి దంపతులు రూ.51వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధిపేట పట్టణ పద్మశాలి సమాజం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్, ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బుర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసులు పాల్గొన్నారు. Striluxon
టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం..
చేనేతమిత్ర, హైదరాబాద్: మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ ఆ వస్త్రాల వెనుక దాగి ఉన్న వారి జీవిత కథ మాత్రం కష్టాల, కన్నీళ్ల కథగానే మిగిలిపోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత నేతన్నల దుస్థితిని గుర్తుచేస్తూ చెప్పిన మాటలు నేటికీ సజీవంగా వినిపిస్తున్నాయి: జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా – చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు ఈ ఒక్క వాక్యమే చేనేత కార్మికుల జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో చేనేత పరిశ్రమ అనేది వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ వృత్తి తరతరాలుగా కొనసాగుతోంది. తివాచీలు, బెడ్ షీట్లను తయారు చేసి…
‘విద్యార్థుల యూనిఫాంలను టెస్కో ద్వారా మాత్రమే కొనాలి’
చేనేతమిత్ర, హైదరాబాద్: గురుకులల్లో విద్యార్థులకు యిచ్చే ఉచిత యూనిఫాంలను టెస్కో(తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ (A.I.W.F) తెలంగాణ రాష్ట్ర నాయకులు చేనేత, జౌళిశాఖ ముఖ్యకార్యదర్శి శైలజ రామయ్యర్‌కు వినతిపత్రం అందజేశారు. చేనేత దుప్పట్లు, బెడ్‌షీట్లు, టవాళ్లను టెస్కోద్వారా కాకుండా టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయాన్ని సమాఖ్య నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. చేనేత కార్మికుల ఇబ్బందులను శైలజ రామయ్యర్‌కు వివరించారు. దీంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. మహాత్మ జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTGBCWREIS) కార్యదర్శి సైదులును కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శి…
కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం..
చేనేతమిత్ర: జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఆగస్టు 7) పురస్కరించుకొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు అవార్డులను ప్రదానం చేయనుంది. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ సంచాలకులు శైలజా రామయ్యర్ ఒక ప్రకటనలో కోరారు. చేనేత వృత్తిలో ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అవార్డుకు ఎంపికైన వారికి రూ.25 వేలు నగదు పురస్కారంతోపాటు ప్రశంసపత్రం, జ్ఞాపక అందజేస్తారని పేర్కొన్నారు. చేనేత కళాకారులు 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయసు ఉండి, 10 సంవత్సరాల అనుభవం ఉండాలని, అలాగే చేనేత డిజైనర్లు 31.12.2025 నాటికి 25 సంవత్సరాల వయసు పూర్తయి ఐదేళ్ల అనుభవం ఉన్న వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. అర్హులు మార్చి 31లోపు తమ దరఖాస్తులను ఆయా జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ…
తెలంగాణలో 2,996 వార్డులకు 28,456 నామినేషన్లు..
చేనేతమిత్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి రోజు 30వ తేదీన భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మొత్తం 2,996 వార్డులకు మూడు రోజులు కలిపి 28,456 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపాలిటీ 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీమతి సామల ప్రసన్న సత్యపాల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు పట్టణంలో 45 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన…
2న బీసీ కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
చేనేతమిత్ర ప్రతినిధి (హైదరాబాద్): రాష్ట్రంలో బీసీ (Backward Classes) వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కులు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చించేందుకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ కుల సంఘాల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. బీసీ మేధావుల ఫోరమ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ, వారికి తగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాతినిధ్యం లభించడం లేదని బీసీ సంఘాలు నేతలు గత కొంతకాలంగా విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీలు సరైన స్థానం ఇవ్వకపోవడం వల్ల బీసీ వర్గాలు నష్టపోతున్నాయని అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌లో బీసీలకు నిజంగా ఎంత న్యాయం జరుగుతోంది? లెక్కల వెనుక దాగిన మోసాలు ఏమిటి? బీసీ నిధులు…
ABPS మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ‘‘బతుకమ్మ’’ వేడుకలు అఖిల భారత పద్మశాలీ మహిళా సంఘం (ABPS) ఆధ్వర్యంలో ఇటీవల ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నారాయణ గూడ సమీపంలోని ఏబీపీఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలీ మహిళా సంఘం అధ్యక్షురాలు వనం దుశ్యంతల, తెలంగాణ పద్మశాలీ మహిళా సంఘం అధ్యక్షురాలు గుంటక రూప, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు పోరండ్ల శారద సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రాలు ధరించి.. బతుకమ్మ పాటలకు కోలాటాలతో నృత్యం చేస్తూ సందడి చేశారు. Striluxon
రాష్ట్రపతికి ఎమ్మెల్సీ రమణ లేఖ..
హైదరాబాద్: చేనేత ముడిసరుకు, ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీరో జీఎస్టీ అమలుకు చొరవ తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుడు(MLC)ఎల్. రమణ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కోరారు. చేనేత రంగంతో తనకున్న సుదీర్ఘ అనుబంధంతో చేనేతల కష్టాలను లేఖలో ఆమెకు వివరించారు గతంలో చేనేత, జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రమణ (L.Ramana). లేఖలో ముఖ్యాంశాలు.. ‘‘2017 నుంచి ముడి సరుకులపై 5% జీఎస్టీ విధించడంతో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి, కార్మికుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా చాలా మంది చేనేత వృత్తికి దూరమయ్యారు. 2025 సెప్టెంబర్ 22 నుంచి చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని 18శాతానికి పెంచారు. చేనేత కార్మికులు, సహకార సంఘాలు లేదా రాష్ట్ర ప్రతినిధులతో చర్చలు జరపకుండానే పెంచడం దారుణం. భారత రాజ్యాంగంలోని వృత్తి స్వేచ్ఛ, జీవన హక్కులను ప్రస్తుత జీఎస్టీ…


