తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం (టీపీయుఎస్) మరో సేవా కార్యక్రమానికి పూనుకుంది. పద్మశాలీ సమాజానికి చెందిన వ్యక్తులు, యువకులు, ఉద్యోగుల నుంచి పుస్తకాలు, స్టడీ మెటీరియల్ సేకరిస్తున్నారు. ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే పలు రకాల పుస్తకాలను సేకరించి వాటిని వరంగల్ హంటర్ రోడ్‌లోని బీసీ నేత హాస్టల్ లైబ్రరీలో భద్రపరుస్తారు. ఫలితంగా వాటిని పేద పద్మశాలీ విద్యార్థులు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎంతో విజ్ఞానాన్ని పంచే పుస్తకాలను కేవలం అల్మారాకు పరిమితం చేయకుండా మరికొంతమంది విద్యార్థులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 11వ తేదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీపీయుఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరందాస్ యాదగిరేందేర్ తన జన్మదిన సందర్భంగా విలువైన పుస్తకాలను అందచేశారు. ఆయనకు సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. పుస్తకాలను విరాళంగా ఇచ్చే వారు సంఘం రాష్ట్ర కార్యాలయ…
Category: విద్య
Prof. G.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (హైదరాబాద్ ) UG & PG నోటిఫికేషన్
Prof. G.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (హైదరాబాద్ ) UG & PG నోటిఫికేషన్ వివరాలకు ఈ క్రింది లింకును క్లిక్ చేయండి https://oupgrrcde.com/Registration/student/Default Liman Dexeris
ALL IN ONE FOR SI & PC, VRO, GR-IV ASPIRANTS
With courtesy by M. Sampath Kumar, RSI ALL IN ONE Nový Kapitstav
టీచర్లు-జాగ్రత్త
10వ తరగతి అనంతరం కోర్సులు
బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన
కర్నూలు నగరంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహంలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బుట్టా ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉస్మానియా కళాశాల ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఎస్‌ఎం బాషా అతిథిగా హాజరై మాట్లాడారు. మార్కులకు బట్టి సమాధానం రాయాలన్నారు. తక్కువ మార్కుల ప్రశ్నలకు క్లుప్తంగా, ఎక్కువ మార్కుల ప్రశ్నలకు ఎక్కువ నిడిమితో సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వివరించారు. కేవీఆర్ కళాశాల ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఫరీదా బేగం మాట్లాడుతూ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. ఏకాగ్రతతో చదివి మంచి గ్రేడ్‌లో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. పాజిటివ్‌గా ఆలోచించాలన్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదన్నారు. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనూరాధ మాట్లాడుతూ ఏకాగ్రతతో చదివి పరీక్షలు బాగా రాసి లక్ష్యసాధనకు ముందుకు సాగాలన్నారు. ప్రముఖ చెస్ శిక్షకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ…