కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదివితే లక్ష్యసాధన సులువని నిరూపించారు హరిత. విద్యావంతులయిన తల్లిదండ్రులు ఆమె ఇష్టానికి అనుగుణంగా నడుచుకున్నారు. డాక్టర్ కావాలన్న ఆమె ఆశయానికి పూర్తిగా సహకరించి ప్రోత్సహించారు. చివరకు లక్ష్యం చేరుకుని కన్నవారికి గుర్తింపు తెచ్చిపెట్టారు మంగళగిరికి చెందిన విద్యాకుసుమం డాక్టర్ హరిత. కుటుంబ నేపథ్యం: దామర్ల వీరాంజనేయులు మంగళగిరిలోని వీటీజేఎం, ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగి. ఝాన్సీరాణి మందడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. వీరికి కూతురు హరిత, కుమారుడు భరత్ సంతానం. చిన్నప్పటి నుంచి చదువులో రాణించిన హరిత తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అరవింద హైస్కూల్‌లో పదోతరగతి, విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో 64వ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో…