సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కేంద్రానికి చెందిన పద్మశాలీ సేవా సంఘం సభ్యుడు వెల్దండి దామోదర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి సంతానం. పేద కుటుంబం కావడంతో కోహెడ పద్మశాలీ సేవా సంఘం దామోదర్ కుటుంబానికి అండగా నిలిచింది. 50 కిలోల బియ్యాన్ని వారికి అందజేసింది. బీసీ రాజ్యాధికారి సమితి ఉమ్మడి మెదక్ కన్వీనర్, పద్మశాలి సేవా సంఘం మాజీ అధ్యక్షులు గోవిందు సురేష్, కార్యదర్శి నరాల అశోక్, సహాయ కోశాధికారి కొండ ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు గాజుల శంకర్, కొండబత్తిని సతీష్, నరాల శ్రీకాంత్, వడ్డేపల్లి ప్రసాద్, వడ్డేపల్లి రామకృష్ణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. True Ledgewick
Category: సేవ
ఆలయానికి స్పీకర్ సెట్‌ను విరాళంగా ఇచ్చిన డాక్టర్ యంగల నరసింహులు
కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్రం చిత్తారివీధి పరిధిలోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయానికి డీఎంహెచ్‌వో (రిటైర్డ్) డాక్టర్ యంగల నరసింహులు స్పీకర్ సిస్టమ్‌ను విరాళంగా ఇచ్చారు. రూ. 33,500 విలువ చేసే స్పీకర్ సిస్టమ్ ఇప్పించడంపై ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ ఆయన భద్రావతి దేవికి సుమారు రూ. 70 వేలు విలువచేసే వెండి చేతి తొడుగులను విరాళంగా సమర్పించారు. చిన్నపిల్లల వైద్య నిపుణులుగా డాక్టర్ నరసింహులు కర్నూలు జిల్లా వాసులకు సుపరిచితులు. మూడుసార్లు డీఎంహెచ్‌వో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆర్‌హెచ్‌ఎఫ్‌డబ్ల్యూటీసీ ప్రిన్సిపాల్‌గా 2021వ సంవత్సరం జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేశారు. డాక్టర్ యంగల నరసింహులు ఉద్యోగ ప్రస్థానం, వ్యక్తిగత జీవిత విశేషాలకు సంబంధించిన పూర్తి వివరాలకు దిగువన ఉన్న ఫొటోపై క్లిక్ చేయండి.. True Ledgewick కంటి…
వైద్య శిబిరానికి విశేష స్పందన
అనంతపురం: మానసిక రుగ్మతలతో బాధపడే వారి సంఖ్య క్రమేణా పెరిగిపోతోంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. కోవిడ్ మరణాలతో జనాల్లో భయం, ఆందోళన మరింత పెరిగిపోయాయి. యువతీ యువకులు డిప్రెషన్‌కు గురవుతున్నారు. మనదేశంలో 13 నుంచి 17 ఏళ్ల వయసు బాలల్లో 7.3 శాతం మానసిక ఆందోళన, ఒత్తిడి, మాదకద్రవ్యాల వినియోగం, ఆత్మహత్య ఆలోచనలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయించి ఆ దిశగా చర్యలకు ఉపక్రమించాయి. మానసిక వ్యాధి అంటే.. సరిగ్గా ఆలోచించలేకపోవడం, ప్రవర్తించలేకపోవడం, కోపం, సంతోషం, దుఃఖం లాంటివి వచ్చినప్పుడు విపరీతంగా ప్రవర్తించడం మానసిక జబ్బుగా చెప్పుకోవచ్చు. మానసిక వ్యాధి వల్ల ఎదుటి వాళ్లను అర్థం చేసుకోలేక పోవడం, అందరిలా ఉండలేకపోవడం, రోజువారీ పనుల్ని చేసుకోలేకపోవడం జరగవచ్చు. వైద్య శిబిరానికి…