‘విద్యార్థుల యూనిఫాంలను టెస్కో ద్వారా మాత్రమే కొనాలి’

శైలజ రామయ్యర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఏఐడబ్ల్యూఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు

చేనేతమిత్ర, హైదరాబాద్: గురుకులల్లో విద్యార్థులకు యిచ్చే ఉచిత యూనిఫాంలను టెస్కో(తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ (A.I.W.F) తెలంగాణ రాష్ట్ర నాయకులు చేనేత, జౌళిశాఖ ముఖ్యకార్యదర్శి శైలజ రామయ్యర్‌కు వినతిపత్రం అందజేశారు. చేనేత దుప్పట్లు, బెడ్‌షీట్లు, టవాళ్లను టెస్కోద్వారా కాకుండా టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయాన్ని సమాఖ్య నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. చేనేత కార్మికుల ఇబ్బందులను శైలజ రామయ్యర్‌కు వివరించారు. దీంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. మహాత్మ జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTGBCWREIS) కార్యదర్శి సైదులును కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శి…

సహకారమే లక్ష్యం – ప్రగతే గమ్యం

ప్రసంగిస్తున్న PBN చైర్మన్ వర్కాల బాలాజీ

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిసారి నిర్వహించిన పద్మశాలీ బిజినెస్ నెట్‌వర్క్ (PBN) మీట్‌ విజయవంతమైంది. హనుమకొండ సమీపంలోని ”HOTEL THOUSAND PILLERS”లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి వివిధ వ్యాపారాలు చేస్తోన్న పద్మశాలీయులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు మార్కండేయ స్వామి పూజ.. అతిథులుగా తెలంగాణ పద్మశాలీ ఉద్యోగ సంఘం (TPUS) రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (NIMS) లైజనింగ్ ఆఫీసర్ మార్తా రమేష్, వరంగల్ పద్మశాలీ సంఘం అధక్షులు ఆడెపు రవీందర్, వ్యాపార వేత్త మైటీ సాగర్, మిమిక్రీ అర్టిస్టు బొమ్మ శ్రీనివాస్, లిమ్కా బుక్ రికార్డ్ హోల్డర్ బి. అశోక్ కుమార్ విచ్చేశారు. ప్రసంగిస్తున్న మార్త రమేష్ ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పద్మశాలీయులు పరస్పరం సహకరించుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాపారాలు…

పద్మశాలీ నిరుద్యోగ యువతకు ఫ్రీ ట్రైనింగ్..

ఇది ఫోటో కాప్షన్

హైదరాబాద్‌: కులాభిమానం ఉన్న వ్యక్తులు అరుదు. తమ కులస్థులను ప్రోత్సహించి, అవసరమైన సాయం చేసి.. జీవనానికి మార్గం చూపే వారు చాలా తక్కువ. తనతో పాటు తన కులస్థులు బాగుండాలని కాంక్షించే వ్యక్తుల్లో ఒకరైన పాపని హేమంత్ కుమార్.. కులస్థులకు సాయపడాలన్న తపనతో.. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ (ఫెయిల్/పాస్) అయిన పద్మశాలీ నిరుద్యోగ యువతకు ‘‘కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసింగ్’’ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన వారిని ప్రామాణికంగా తీసుకుని బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు.  హేమంత్ కుమార్ గురించి క్లుప్తంగా.. వందల మందికి ఉపాధి చూపిన పాపని హేమంత్ కుమార్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట గ్రామం. సత్యనారాయణ, దేవమ్మ దంపతులకు మూడో సంతానమైన హేమంత్‌కు అక్క, చెల్లి ఉన్నారు. హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక కంప్యూటర్ హార్డ్‌వేర్ నేర్చుకోవాలన్న…

దసరా శరన్నవరాత్రోత్సవాల్లో చండీహోమం కూడా..

కర్నూలు: కర్నూలు నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సారి నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజూ చండీ హోమం ఏర్పాటు చేస్తున్నారు. దసరా శరన్నవరాత్రోత్సవాల ఆహ్వాన పత్రికను పార్లమెంటు కర్నూలు నియోజకవర్గ మాజీ సభ్యులు డాక్టర్. సింగరి సంజీవ్ కుమార్ ఇటీవల ఆవిష్కరించారు. ఆహ్వానపత్రికను ఆవిష్కరిస్తున్న యూరాలజిస్టు సంజీవకుమార్ ‘ముందుగా తెలపగలరు’ ‘‘హోమంలో పాల్గొనే దంపతులు (ఒక జంట) రూ. 11,116 చెల్లించాల్సి ఉంటుంది. వారితో వేద పండితులు హోమం చేయిస్తారు. హోమ సామగ్రి కూడా మేమే సమకూరుస్తాం. గుండం చుట్టూ ఒకేసారి 5 జంటలు కూర్చొవచ్చు. ఆసక్తి గల వారు ముందుగా…

సెప్టెంబర్ 9న హనుమకొండలో PBN Meet

హైదరాబాద్: పద్మశాలీ బిజినెస్ నెట్‌వర్క్ (PBN) సమావేశాన్ని తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలో సెప్టెంబర్ 9న నిర్వహిస్తున్నారు. హనుమకొండ బాలసముద్రం సమీపంలోని ”HOTEL THOUSAND PILLERS”లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ మీట్‌కు పలువురు పద్మశాలీ ప్రముఖులు విచ్చేస్తున్నారు.  అతిథులెవరు? వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ప్రముఖ వ్యాపారవేత్త గుండు ప్రభాకర్, తెలంగాణ పద్మశాలీ ఉద్యోగ సంఘం (TPUS) రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (NIMS) లైజనింగ్ ఆఫీసర్ మార్తా రమేష్, వ్యాపార వేత్తలు మైటీ సాగర్, గుండు విజయ్ రాజ్, వరల్డ్ రికార్డ్ హోల్డర్, మిమిక్రీ అర్టిస్టు బొమ్మ శ్రీనివాస్, లిమ్కా బుక్ రికార్డ్ హోల్డర్ బి. అశోక్ కుమార్ అతిథులుగా హాజరవుతున్నారు. PBN ఎందుకు? ఇది పద్మశాలీ…

అనకాపల్లి పద్మశాలీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక

విశాఖపట్నం: విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని అనకాపల్లి పద్మశాలీ సంక్షేమ సంఘం నూతన కమిటీ (రి.నెంబర్.89/2014) ఎన్నిక ఇటీవల జరిగింది. గౌరవ అధ్యక్షులుగా అముజూరి రామకృష్ణ, నూతన అధక్షులుగా డాక్టర్ గెడ్డం ప్రభాకర్ దివ్యతేజ, ఉపాధ్యక్షులుగా తిప్పాన అప్పారావు, దొడ్డి సూరిబాబు, ప్రధాన కార్యదర్శిగా సూరిసెట్టి రుషిబాబు, సహాయ కార్యదర్శులుగా కాకి శ్రీను, ఇమంది విజయ్ కుమార్, కోశాధికారిగా ఆకుల వెంకట అప్పారావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కాకి పైడిరాజు, సహాయ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆకుల రాజుబాబును ఎన్నుకున్నారు. సలహాదారు కమిటీ కూడా ఎన్నికైంది. అనకాపల్లి శారదా కాలనీలోని సాయితేజ ఆసుపత్రి ఆవరణలో జరిగిన సర్వసభ్య సమావేశానికి పలువురు పద్మశాలీ కులస్థులు హాజరయ్యారు.  website : www.chenetamitra.com whatsapp Number: 83338 71117 e mail: chenetamitra@gmail.com click here to join facebook : chenetamitra Maasapatrika    …

వనపర్తి జిల్లాకు తెలంగాణ చేనేత ఐక్యవేదిక నేతలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చేనేతలు దుర్భర పరిస్థితులతో జీవనం సాగిస్తున్నారు. నేత కార్మికుల సమస్యలు వర్ణనాతీతం. వారితో ముఖాముఖి మాట్లాడి వారి స్థితిగతులు తెలుసుకోవడం, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ చేనేత ఐక్యవేదిక పూనుకుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 5వ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కొత్తకోట చేనేత కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్, ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ విచేస్తున్నారు. అనంతరం 11 గంటలకు వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చేరుకుని, అక్కడ చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటారు. చేనేత కార్మిక సంఘం నాయకులు, చేనేత సహకార సంఘం నాయకులు, చేనేత కార్మికులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు యంగళి రాజు విజ్ఞప్తి చేశారు.…

PBN నూతన ఛైర్మన్‌గా వర్కాల బాలాజి

హైదరాబాద్‌: సంఘం అంటే ఒక సమూహం. ఐక్యతకు చిహ్నం. కులస్థుల అభ్యున్నతికి చుక్కాని. ఇదే లక్ష్యంతో పురుడుపోసుకుంది పద్మశాలీ బిజినెస్ నెట్‌వర్క్(PBN). వివిధ వ్యాపారాలు చేస్తున్న పద్మశాలీయులను ఒక చోటకు చేర్చే వేదిక. పరస్పర పరిచయాల ద్వారా ‘‘మనం ఎదుగుదాం..మనవాళ్లును ఎదగనిద్దాం’’ అంటూ ముందుకెళ్తున్న PBN నూతన చైర్మన్‌గా వర్కాల బాలాజి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా సంగిశెట్టి నరేందర్, ఉపాధ్యక్షులుగా గుత్తి శంకర్, రామ్ తిరుమల, కోశాధికారిగా మాచర్ల నాగార్జున, కార్యనిర్వాహక కార్యదర్శులుగా చింతకింది ప్రభాకర్, బొమ్మెర్ల స్వప్నప్రియ, సభ్యులుగా వణమాల విజిత్, చిలువేరు శివ, బిర్రు యుగంధర్ కొనసాగుతున్నారు. PBN ఎందుకు? పద్మశాలీ వ్యాపారుల కనెక్టివిటీ కోసం ఏర్పాటయిన వేదిక. అవకాశం ఉన్న చోట వ్యాపారాల విస్తరణ, పరస్పర సహకారంతో ఎదగడం కోసం ఏర్పాటయిన సమూహం. అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు, దూరదృష్టి గల వ్యక్తుల సహకారంతో…

ఆర్మూర్ పట్టణ పద్మశాలీ సంఘం మహిళా విభాగం ఏర్పాటు

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణ పద్మశాలీ మహిళా విభాగం ఇటీవల ఏర్పడింది. రెండేళ్ల పాటు కొనసాగే ఈ కమిటీకి అధ్యక్షురాలిగా దోపతి హేమలత, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల వసంతలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు మిగతా కమిటీ సభ్యులను త్వరలో ఎన్నుకోనున్నారు. కాగా హేమలత భర్త మ్యాక మోహన్ ‌దాస్ ఇప్పటికే ఆర్మూర్ పట్టణ పద్మశాలీ సంఘానికి అధ్యక్షులుగా, అలాగే వసంతలక్ష్మి భర్త కొక్కుల రామాకాంత్ సంఘానికి ప్రధాన్య కార్యదర్శిగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి బండి సుష్మ, ఈరువాత్రి సునీత, కొక్కుల భూలక్ష్మి, బత్తుల సంధ్య, దోపతి ఉమారాణి, బొట్ల నవత, దోపతి త్రివేణి, పొలాస లలిత, దాసరి నిర్మల, సిరిగిరి పూర్ణ, నూకల శైలజ, నడిమెట్ల వసంత, బ్రహ్మడండి లయశ్రీ, భాగ్య, రజిత, లహరి, అఖిల తదితరులు హాజరయ్యారు. వీరంతా నూతన అధ్యక్ష, ప్రధానకార్యదర్శికి శుభాకాంక్షలు తెలిపారు.…

చిన్నారులకు పునర్జన్మ..

హైదరాబాద్‌: చిన్ని గుండెకు పుట్టుకతోనే ఏదో ఇబ్బంది. లబ్‌డబ్ శబ్దం ఏ క్షణాన మూగబోతుందన్న భయం..తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేలు, లక్షల్లో ఖర్చయ్యే వైద్యం. భరించలేక స్థితిలో పేదరికం. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు నోచుకోని చిన్నారులకు తెలంగాణ రాష్టం హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (NIMS) అండగా నిలుస్తోంది. గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా చేయబోతుంది. ఆ వివరాలు నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప మాటల్లోనే.. ‘‘పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్‌లో ఆపరేషన్లు చేయబోతున్నాం. బ్రిటన్‌ వైద్యుల సహకారంతో సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఈ శస్త్ర చికిత్సలు జరుగుతాయి. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తక్షణమే ఆపరేషన్లు చేస్తారు. ఆసుపత్రి పాత భవనంలోని సీటీవీఎస్ గదిలో డా. అమరేష్‌ రావు, డా.…