PBN నూతన ఛైర్మన్‌గా వర్కాల బాలాజి

హైదరాబాద్‌: సంఘం అంటే ఒక సమూహం. ఐక్యతకు చిహ్నం. కులస్థుల అభ్యున్నతికి చుక్కాని. ఇదే లక్ష్యంతో పురుడుపోసుకుంది పద్మశాలీ బిజినెస్ నెట్‌వర్క్(PBN). వివిధ వ్యాపారాలు చేస్తున్న పద్మశాలీయులను ఒక చోటకు చేర్చే వేదిక. పరస్పర పరిచయాల ద్వారా ‘‘మనం ఎదుగుదాం..మనవాళ్లును ఎదగనిద్దాం’’ అంటూ ముందుకెళ్తున్న PBN నూతన చైర్మన్‌గా వర్కాల బాలాజి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా సంగిశెట్టి నరేందర్, ఉపాధ్యక్షులుగా గుత్తి శంకర్, రామ్ తిరుమల, కోశాధికారిగా మాచర్ల నాగార్జున, కార్యనిర్వాహక కార్యదర్శులుగా చింతకింది ప్రభాకర్, బొమ్మెర్ల స్వప్నప్రియ, సభ్యులుగా వణమాల విజిత్, చిలువేరు శివ, బిర్రు యుగంధర్ కొనసాగుతున్నారు.

PBN ఎందుకు?
పద్మశాలీ వ్యాపారుల కనెక్టివిటీ కోసం ఏర్పాటయిన వేదిక. అవకాశం ఉన్న చోట వ్యాపారాల విస్తరణ, పరస్పర సహకారంతో ఎదగడం కోసం ఏర్పాటయిన సమూహం. అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు, దూరదృష్టి గల వ్యక్తుల సహకారంతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్థాపించడం సంస్థ PBN.

‘ఎదుగుదాం.. ఎదగనిద్దాం’
2024 జూలైలో పద్మశాలీ బిజినెస్ నెట్‌వర్క్ లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ రిలేషన్స్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తోన్న IAS ఆఫీసర్ పరికిపండ్ల నరహరి విచ్చేశారు. Networkకు ఉన్న ప్రాధాన్యం గురించి ఆయన ప్రసంగించారు.

‘‘Your network is Your networth..’’ దీనిమీద మీ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. నెట్‌వర్కింగ్ ద్వారా పరిచయాలు పెరుగుతాయి. సంబంధాలు విస్తరిస్తాయి. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు క్రమేణా తగ్గుతున్న నేపథ్యంలో.. యువత స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువ పారిశ్రామిక వేత్తలకు ఇస్తోన్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకుని తమకు ఇష్టమైన రంగంలో రాణించాలి. పద్మశాలీ యువతకు ఆదర్శంగా నిలవాలి. వ్యక్తుల సమూహమే సంఘం. సంఘం అభివృద్ధికి సభ్యులంతా బాధ్యత తీసుకోవాలి. వ్యాపారంలో ఇప్పటికే స్థిరపడ్డవారు, పరిశ్రమలు ఏర్పాటు చేసి నిలదొక్కుకున్న వారు తోటి పద్మశాలీ నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి. పద్మశాలీ బిజినెస్ నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి. మనం ఎదగాలి..మనవాళ్లను ఎదగనివ్వాలి.’’ అని అన్నారు.

ఇస్టాలో ఫాలోకండి .. https://www.instagram.com/pbnofficial24/
PBN నెట్‌వర్క్‌లో చేరాలనుకునేవారు వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు..8523031435, 9908215155

వరంగల్‌లో PBN మీటింగ్..

‘‘తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలో PBN మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సెప్టెంబర్ 9న హనుమకొండ బాలసముద్రం సమీపంలోని ”HOTEL THOUSAND PILLERS”లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ మీట్‌కు PBN కోర్ కమిటీ సభ్యులంతా హాజరవుతారు’’. – వర్కాల బాలాజి

గూగుల్ లొకేషన్ కోసం దిగువన ఉన్న ఫొటోపై క్లిక్ చేయండి..

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Euro Sense

Follow us on social media

Related posts