ఆయన వృత్తి బోధన. ప్రవృత్తి సామాజిక సేవ. కులాభిమానంతో పోపాకు ఎంతో సేవ చేశారు. ఐదుసార్లు అధ్యక్షులుగా కొనసాగారు. అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. కులస్థుల అభ్యున్నతికి ఎంతో పరితపించేవారు. ఆయనే భీమనిపల్లె గురుస్వామి గారు. వీరి స్వగ్రామం కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలోని వేల్పనూరు గ్రామం. భీమనిపల్లె అంకన్న, అచ్చమ్మ దంపతులకు జూలై 26,1939న జన్మించారు. వీరి మేనమామ దివంగత నారాయణ చిన్న బాలన్న (నంద్యాల). గురుస్వామి గారి ప్రాథమిక విద్య వేల్పనూరులో, హైస్కూలు విద్య కర్నూలులోని మునిసిపల్ హైస్కూల్‌లో కొనసాగింది. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకాం, శ్రీ కృష్ణ దేవరాయ (అనంతపురం) యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశారు. కామర్స్ లెక్చరర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. 1974 నుంచి 1997 వరకు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో, కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో…
Category: నివాళి
యెలగం వీరస్వామికి శ్రద్ధాంజలి
తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట పద్మశాలీ అన్నదాన సత్రం అధ్యక్షులు యెలగం వీరస్వామికి చేనేత సంఘాల నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. జూలై 31వ తేదీ వరంగల్ జిల్లా కొత్తవాడలో అమరవీరుల స్థూపం దగ్గర ఆయనకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా నేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొత్తవాడ పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది వీరస్వామి పేరని, అంతటి మహోన్నతి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. కొత్తగా ఆర్డర్లు తెప్పించి వారికి ఉపాధి కల్పించారని, అలాగే చేనేత సంఘాల బలోపేతానికి, పద్మశాలీయుల ఐక్యతకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. వేములవాడ, బాసర,యాదగిరి గుట్ట, శ్రీశైలం, తిరుపతి, కాశీలో అన్నదాన సత్రాల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని పద్మశాలీ…
చంద్రయ్య మృతికి పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నివాళి
ఆనందపు చంద్రయ్య ఇటీవల మృతిచెందారు. ఆయన మృతికి పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీవా) గుంటూరు శాఖ సభ్యులు, సాంబశివరావు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు సంతాపం తెలిపారు. అంత్యక్రియల కోసం పీవా గుంటూరు బ్రాంచ్ తరుపున రూ. 4వేలు, ట్రస్ట్ తరుపున రు.2వేలు ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. గుఱ్ఱం చిన వీరయ్య, దామోదర్, శ్రీధర్, ఈశ్వరరావు, ఏనుగుల శ్రీను, గుంటి నరసింహారావు, వీర రాఘవయ్య, రఘురాం చంద్రయ్య మృతదేహానికి నివాళి అర్పించారు. చంద్రయ్య తొలుత గుంటూరు చేనేత సొసైటీలో చేరి తరువాత చేనేత విక్రయశాలలో గుమాస్తాగా పనిచేశారని, కొంతకాలం పాటు రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో కూడా పనిచేశారని వారు గుర్తు చేసుకున్నారు. Fundex Bitport