చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం (టీపీయుఎస్)ను మరింత బలోపేతం చేసేందుకు పద్మశాలీ ఉద్యోగులంతా కృషి చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వరులు సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లా సంఘం అధ్యక్షులు జెట్ల భాస్కర్ అధ్యక్షతన ఈ నెల 29న సంగారెడ్డి శాంతినగర్‌లోని మాస్టర్ డిగ్రీ, పీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతీ పద్మశాలి ఉద్యోగిని సంఘంలో చేర్పించాలని జిల్లా కార్యవర్గసభ్యులకు సూచించారు. ఉద్యోగులంతా పేద పద్మశాలీలకు చేయూతనందించేందుకు సహకరించాలని కోరారు. అనంతరం వివాహ పరిచయ వేదికను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాస్ యాదగిరి, రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి శిరందాసు యాదగిరేందర్, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మామిడాల రవికుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా…
Category: పద్మశాలి
వైద్య శిబిరానికి విశేష స్పందన
అనంతపురం: మానసిక రుగ్మతలతో బాధపడే వారి సంఖ్య క్రమేణా పెరిగిపోతోంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. కోవిడ్ మరణాలతో జనాల్లో భయం, ఆందోళన మరింత పెరిగిపోయాయి. యువతీ యువకులు డిప్రెషన్‌కు గురవుతున్నారు. మనదేశంలో 13 నుంచి 17 ఏళ్ల వయసు బాలల్లో 7.3 శాతం మానసిక ఆందోళన, ఒత్తిడి, మాదకద్రవ్యాల వినియోగం, ఆత్మహత్య ఆలోచనలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయించి ఆ దిశగా చర్యలకు ఉపక్రమించాయి. మానసిక వ్యాధి అంటే.. సరిగ్గా ఆలోచించలేకపోవడం, ప్రవర్తించలేకపోవడం, కోపం, సంతోషం, దుఃఖం లాంటివి వచ్చినప్పుడు విపరీతంగా ప్రవర్తించడం మానసిక జబ్బుగా చెప్పుకోవచ్చు. మానసిక వ్యాధి వల్ల ఎదుటి వాళ్లను అర్థం చేసుకోలేక పోవడం, అందరిలా ఉండలేకపోవడం, రోజువారీ పనుల్ని చేసుకోలేకపోవడం జరగవచ్చు. వైద్య శిబిరానికి…