హైదరాబాద్: నేత నేయడం తప్ప మరో పని తెలియని మారుమూల గ్రామమది. అక్షరజ్ఞానం అంతంత మాత్రమే. చదువుకుంటే ప్రయోజకుడివి అవుతావు అని చెప్పేవారు కూడా లేని రోజులవి. అయితే కసితో చదివారు. ఇంగ్లీషు భాషపై పట్టుసాధించారు. డిగ్రీ ఆపై ఎన్నో కోర్సులు పూర్తిచేసి.. బెంగళూరులోని సీఎంకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ (టెక్నికల్) స్థానానికి ఎదిగిన మహోన్నత శిఖరం మేరువ వేంకటేశ్వర్లు. మేరువ వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) సభ్యునిగా ఎంపికయ్యారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, వినియోగదారుల హక్కులకు రక్షణ కల్పించడం RERA ముఖ్యోద్దేశం. విజయవాడ కార్యాలయంలో సెప్టెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేసిన మేరువకు పలువురు పద్మశాలీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మేరువ వెంకటేశ్వర్లు ‘‘చేనేతమిత్ర’’తో చాలా విషయాలు పంచుకున్నారు. విద్యాభ్యాసం.. 1963వ…