చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి మెరుగైన ఫలితాలు సాధించిన 21 మంది విద్యార్థిని, విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. మార్కండేయ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టోత్సవానికి పంతం రవి దంపతులు రూ.51వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధిపేట పట్టణ పద్మశాలి సమాజం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్, ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బుర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసులు పాల్గొన్నారు. Striluxon
Category: దాత
బాధితులకు ఏపీ జాతీయ చేనేత ఐక్య వేదిక ఆర్థిక సాయం
చేనేతమిత్ర ప్రతినిధి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పరిధిలోని బండారులంక గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చేనేత కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.ఆంధప్రదేశ్ జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుంకర చిన్నరెడ్డి బాబు ఆధ్వర్వంలో సభ్యులు తమ వంతుగా విరాళాలు సేకరించి బాధితులకు రూ. 20వేల ఆర్థిక సాయం చేశారు. అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన 2 ఇళ్లకు రూ. 6 వేల చొప్పున రూ. 12 వేలు, పాక్షికంగా కాలిపోయిన 3 ఇళ్లకు రూ. 2 వేల చొప్పున రూ.6 వేలు అందజేశారు. అగ్ని ప్రమాద సమయంలో సాయపడ్డ మరో వ్యక్తి రూ. 2 వేలు అందజేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లాడ సూర్య భాస్కరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండా…
కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆర్థిక సాయం
కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఓ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. పిల్లల చదువు కోసం ఆర్థిక సాయం చేశారు. కర్నూలు నగరం బంగారుపేటకు చెందిన షకీనాబీ, రజాక్‌బాషా దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు అబ్దుల్ రహెమాన్ స్థానిక ఓ పాఠశాలలో 8వ తరగతి, కూతురు యుకేజీ చదువుతోంది. రజాక్‌బాషా వాచ్‌మన్‌గా పనిచేసేవారు. ఆయన మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. షకీనాబీ ఆర్థిక ఇబ్బందులను స్థానికులు బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె స్పందించి బుట్టా ఫౌండేషన్ తరుపున రూ. 16వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా తమను ఆదుకున్న బుట్టా రేణుకకు షకీనాబీ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. Quantumai
మృతుల కుటుంబాలకు నిత్యావసరాలు, నగదు పంపిణీ
శ్రీకాకుళం జిల్లా పద్మశాలీ సంక్షేమ సంఘం సభ్యులు కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు అండగా నిలిచారు. ఆంధప్రదేశ్ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఎఎన్ మూర్తి, సహాధ్యక్షులు కేఎస్ చక్రధారి, ప్రధాన కార్యదర్శి నాగమల్ల విశ్వ ప్రసాద్ సూచనమేరకు కరోనాతో మృతిచెందిన 5 కుటుంబాలకు రూ. వెయ్యి విలువ చేసే 15 రకాల నిత్యావసరాల కిట్‌తో పాటు రూ. 2వేల నగదును జూలై 7వ తేదీన అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ సలహా దారులు దూబ పద్మారావు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రామక్రిష్ణ, శ్రీనివాసులు, ప్రసాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్, యువజన విభాగం అధ్యక్షులు రమణ, జనరల్ సెక్రటరి పేరిశెట్టి నరసింగరావు, కోదండరాం, నూలు నారాయణరావు, శ్రీనివాస్, పందిరి చిన్నారావు, శోభనబాబు, చలపతి రావు, సతీష్, ఇమంది వెంకటరమణ, మూర్తి, కల్లూరి రమణ,…
తగరపువలస పద్మశాలీ సేవా సంఘం ఆర్థిక సాయం
విశాఖ జిల్లా తగరపువలస పద్మశాలీ సేవా సంఘం సభ్యులు ఓ మహిళకు ఆర్థిక సాయం చేశారు. తగరపువలసలో నివాసం ఉంటున్న శేశెట్టి జయరామ్ భార్య సత్య కళ్యాణికి రక్తం గడ్డ కట్టడం వల్ల కాలికి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఇటీవల శస్త్ర చికిత్స పూర్తయ్యింది. జయరామ్ పేద కుటుంబం కావడంతో కుటుంబ పోషణ, మందుల ఖర్చులకుగానూ ఆర్థిక సాయం చేసేందుకు తగరపువలస పద్మశాలీ సేవా సంఘం ముందుకు వచ్చింది. రూ.10వేలను జూన్ 30వ తేదీన సంఘం అధ్యక్షుడు కొప్పల రమేష్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిన రామలక్ష్మణ, సంఘం గౌరవాధ్యక్షులు మాదాబత్తుల గురునాథ్, కొప్పల అప్పారావు (రాధిక), సెక్రెటరీ కోసూరు మురళి కలిసి సత్యకళాణి ఇంటికి వెళ్లి ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో కోసూరు రాంబాబు, క్యాషియర్ చింతల ఋషి, కొప్పల కృష్ణ, జోగ అప్పారావు, జోగా…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్లకు నిత్యావసరాల పంపిణీ
కరోనా నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లకు స్కూల్ యాజమాన్యాలు జీతాలు చెల్లించే స్థితిలో లేవు. దీంతో వారి ఆర్థిక ఇబ్బందులను ఆల్ కమ్యూనిటీ అసోసియేషన్ స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపకులు ఆకురాతి రేవంత్ చీరాల లయన్స్ క్లబ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్లబ్ సభ్యులు స్పందించి జూన్ 29వ తేదీ ఒక్కొక్కరికి రూ. వెయ్యి విలువ చేసే నిత్యావసరాల కిట్లను 35 మంది టీచర్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బ్రహ్మరెడ్డి, జీవీ నారాయణ హాజరయ్యారు. ఇక ముందు లయన్స్ క్లబ్‌తో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొంటూ క్లబ్ సభ్యుడిని రేవంత్ సభ్యత్వం తీసుకున్నారు.website : www.chenetamitra.com whatsapp Number: 83338 71117 e mail: chenetamitra@gmail.com click here to join facebook…
కంటి ఆపరేషన్‌కు బుట్టా ఫౌండేషన్ ఆర్థిక సాయం
కర్నూలు జిల్లా పత్తికొండకి చెందిన మాబునికి కంటిచూపు తగ్గింది. కుటుంబసభ్యులు వైద్యుడి వద్ద చూపించారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకు సుమారు రూ. 13వేల దాకా ఖర్చవుతుందని చెప్పడంతో పేదరికం, ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబసభ్యులు మిన్నకుండిపోయారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ సభ్యులు బుట్టా ఫౌండేషన్ దృష్టికి తెచ్చారు. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక వెంటనే స్పందించారు. మాబునికి ఆపరేషన్ చేయించేందుకు వైద్యులతో మాట్లాడాలని ఫాండేషన్ మేనేజర్ రాజేష్‌కు సూచించారు. కర్నూలులోని సుశీల నేత్రాలయలో రూ.12,500 చెల్లించి కంటి ఆపరేషన్ చేయించారు. మందుల ఖర్చులకు మరో రూ. 2వేలను మాబుని కుటుంబసభ్యులకు ఇచ్చారు. కంటి ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేసిన బుట్టా రేణుకకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని మాబుని, ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. Zlatá Era
నిత్యావసరాల కిట్ల పంపిణీ – ఉదారత చాటుకున్న డీఎస్‌ఆర్ హ్యాండ్లూమ్ అధినేత దామర్ల శివయ్య
చీరాల పట్టణంలోని దామర్ల సుబ్బారావు (డీఎస్‌ఆర్) హ్యాండ్లూమ్ అధినేత దామర్ల శివయ్య దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా నేపథ్యంలో తమ సిబ్బందికి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. రూ. 1300 విలువ చేసే కిట్‌ను (బియ్యం బస్తా, నిత్యావసరాలు, కూరగాయలు) 100 మంది సిబ్బందికి జూన్ 26వ తేదీ అందజేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీకాంత్, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బాలా హ్యాండ్లూమ్స్ అధినేత బండారు బాలనాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, చేనేత నాయకులు గోలి గిరి కుమార్, రాజేష్ గుంటి, కారంపూడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారంలో.. “సుమారు 40 ఏళ్ల నుంచి వస్త్ర వ్యాపారంలో ఉన్నాం. మా సొంత మగ్గాలపై కొన్ని…
అమ్మాయి పెళ్లికి ఆర్థిక సాయం – అండగా నిలిచిన తగరపువలస పద్మశాలీ సంఘం
విశాఖ జిల్లాలో ఓ అమ్మాయి కుటుంబానికి తగరపువరస పద్మశాలీ సంఘం అండగా నిలిచించి. పెళ్లి కోసం సంఘం సభ్యులు ఆర్థిక సాయం చేశారు. విశాఖ జిల్లా తగరపువలస పట్టణం గ్రంథాలయం వీధిలో నివాసం ఉంటున్న మాదాబత్తుల శ్రీను, రూప దంపతులకు కూతురు, కొడుకు సంతానం. శ్రీను నూడిల్స్ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కొంతకాలం క్రితం పక్షవాతానికి గురికావడంతో కుటుంబం గడవడం కష్టమైంది. మరోవైపు కూతురి పెళ్లికి డబ్బు అవసరమైంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీనుకు తగరపువలస పద్మశాలీ సంఘం బాసటగా నిలిచింది. తమ వంతు సాయంగా సంఘం అధ్యక్షుడు కొప్పల రమేష్, పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిన రామలక్ష్మణ, గౌరవాధ్యక్షులు మాదాబత్తుల గురునాథ్, కొప్పల అప్పారావు (రాధిక), కోశాధికారి మురళి కలిసి రూ. 20 వేలను శ్రీను కుటుంబసభ్యులకు జూన్ 24వ తేదీ అందజేశారు. కార్యక్రమంలో…
బుట్టా ఫౌండేషన్ ఆర్థిక సాయం
కర్నూలు జిల్లా హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామానికి చెందిన వైడీ జయరాం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రెండు నెలల క్రితం వీల్‌చైర్, వాటర్ బెడ్ కోసం బుట్టా ఫౌండేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించి ఆయనకు రూ. 5వేలు ఆర్థిక సాయం చేశారు. స్థానిక వైసీపీ నాయకులు ఓ. షఫీఉల్లా, దర్గాప్ప, మంజునాథ్, లక్ష్మణ్, రాజా జగ్గాడి, ఎరన్న జూన్ 25వ తేదీన నగదును జయరాంకు అందజేశారు. Wealthicator