విశాఖ జిల్లా తగరపువలస పద్మశాలీ సేవా సంఘం సభ్యులు ఓ మహిళకు ఆర్థిక సాయం చేశారు. తగరపువలసలో నివాసం ఉంటున్న శేశెట్టి జయరామ్ భార్య సత్య కళ్యాణికి రక్తం గడ్డ కట్టడం వల్ల కాలికి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఇటీవల శస్త్ర చికిత్స పూర్తయ్యింది. జయరామ్ పేద కుటుంబం కావడంతో కుటుంబ పోషణ, మందుల ఖర్చులకుగానూ ఆర్థిక సాయం చేసేందుకు తగరపువలస పద్మశాలీ సేవా సంఘం ముందుకు వచ్చింది. రూ.10వేలను జూన్ 30వ తేదీన సంఘం అధ్యక్షుడు కొప్పల రమేష్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిన రామలక్ష్మణ, సంఘం గౌరవాధ్యక్షులు మాదాబత్తుల గురునాథ్, కొప్పల అప్పారావు (రాధిక), సెక్రెటరీ కోసూరు మురళి కలిసి సత్యకళాణి ఇంటికి వెళ్లి ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో కోసూరు రాంబాబు, క్యాషియర్ చింతల ఋషి, కొప్పల కృష్ణ, జోగ అప్పారావు, జోగా రాజారావు, కుంచం అప్పలరాజు, బడిగంటిమహేష్, గిడుతూరు మురళి, పూర్ణ, టైలర్ నూలు గోవింద్, ఏలూరి శంకర్, మెకానిక్ ఆలేటి ఆదినారాయణ, మీసాల బుచ్చిబాబు, కోసురు ఫణి బ్రదర్స్, కొల్లి గోవింద్ బ్రదర్స్, మొండి కృష్ణ, వానపల్లి కిషోర్, కోసురు వెంకటేష్, బండారు ఎర్రిబాబు, సూరిశెట్టి సూర్య, టె•లర్ సత్తిబాబు, తమ్మిన ప్రసాద్, తమ్మిన శంకర్, కల్లూరి తరుణ్ పాల్గొన్నారు.website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Poland Capital
తగరపువలస పద్మశాలీ సేవా సంఘం ఆర్థిక సాయం
