చంద్రయ్య మృతికి పద్మశాలీ ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నివాళి

ఆనందపు చంద్రయ్య ఇటీవల మృతిచెందారు. ఆయన మృతికి పద్మశాలీ ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (పీవా) గుంటూరు శాఖ సభ్యులు, సాంబశివరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ సభ్యులు సంతాపం తెలిపారు. అంత్యక్రియల కోసం పీవా గుంటూరు బ్రాంచ్‌ తరుపున రూ. 4వేలు, ట్రస్ట్‌ తరుపున రు.2వేలు ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. గుఱ్ఱం చిన వీరయ్య, దామోదర్‌, శ్రీధర్‌, ఈశ్వరరావు, ఏనుగుల శ్రీను, గుంటి నరసింహారావు, వీర రాఘవయ్య, రఘురాం చంద్రయ్య మృతదేహానికి నివాళి అర్పించారు. చంద్రయ్య తొలుత గుంటూరు చేనేత సొసైటీలో చేరి తరువాత చేనేత విక్రయశాలలో గుమాస్తాగా పనిచేశారని, కొంతకాలం పాటు రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో కూడా పనిచేశారని వారు గుర్తు చేసుకున్నారు. Fundex Bitport

Follow us on social media

Related posts

Leave a Comment