ఆర్మూర్ పట్టణ పద్మశాలీ సంఘం మహిళా విభాగం ఏర్పాటు

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణ పద్మశాలీ మహిళా విభాగం ఇటీవల ఏర్పడింది. రెండేళ్ల పాటు కొనసాగే ఈ కమిటీకి అధ్యక్షురాలిగా దోపతి హేమలత, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల వసంతలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు మిగతా కమిటీ సభ్యులను త్వరలో ఎన్నుకోనున్నారు. కాగా హేమలత భర్త మ్యాక మోహన్ ‌దాస్ ఇప్పటికే ఆర్మూర్ పట్టణ పద్మశాలీ సంఘానికి అధ్యక్షులుగా, అలాగే వసంతలక్ష్మి భర్త కొక్కుల రామాకాంత్ సంఘానికి ప్రధాన్య కార్యదర్శిగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి బండి సుష్మ, ఈరువాత్రి సునీత, కొక్కుల భూలక్ష్మి, బత్తుల సంధ్య, దోపతి ఉమారాణి, బొట్ల నవత, దోపతి త్రివేణి, పొలాస లలిత, దాసరి నిర్మల, సిరిగిరి పూర్ణ, నూకల శైలజ, నడిమెట్ల వసంత, బ్రహ్మడండి లయశ్రీ, భాగ్య, రజిత, లహరి, అఖిల తదితరులు హాజరయ్యారు. వీరంతా నూతన అధ్యక్ష, ప్రధానకార్యదర్శికి శుభాకాంక్షలు తెలిపారు.

 

Earnings

Follow us on social media

Related posts