కర్నూలు: కర్నూలు నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సారి నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజూ చండీ హోమం ఏర్పాటు చేస్తున్నారు.
దసరా శరన్నవరాత్రోత్సవాల ఆహ్వాన పత్రికను పార్లమెంటు కర్నూలు నియోజకవర్గ మాజీ సభ్యులు డాక్టర్. సింగరి సంజీవ్ కుమార్ ఇటీవల ఆవిష్కరించారు.


‘ముందుగా తెలపగలరు’
‘‘హోమంలో పాల్గొనే దంపతులు (ఒక జంట) రూ. 11,116 చెల్లించాల్సి ఉంటుంది. వారితో వేద పండితులు హోమం చేయిస్తారు. హోమ సామగ్రి కూడా మేమే సమకూరుస్తాం. గుండం చుట్టూ ఒకేసారి 5 జంటలు కూర్చొవచ్చు. ఆసక్తి గల వారు ముందుగా నన్ను లేదా మా కమిటీ సభ్యులను సంప్రదించవచ్చు. చండీ హోమం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. హోమంతో పాటుగా సామూహిక కుంకుమార్చన ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అనంతరం తీర్థప్రసాద వితరణ ఉంటాయి. పద్మశాలీ కులస్థులంతా ఆలయానికి విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలని మనవి చేస్తున్నాం.’’
– ఎర్రనాగు శేషయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు (9949203903)
– దాసపతి జయప్రకాశ్, ప్రధాన కార్యదర్శి (9490054499)
– ఉట్ల రాఘవేంద్ర, సహాయ కార్యదర్శి (9494510455)
– గంజి వెంకటరమణ, సభ్యులు (7799577668)
– గుద్దేటి వేణు గోపాల్, సభ్యులు (9963232024)
– సభ్యులు అవ్వరాపు రామగోవిందు, నీలి గోవిందు, దండు గిరి, బోడ లక్ష్మీనారాయణ, కాంచనం బాస్కర్, చెన్న గంగాధర్, ప్యాపిలీ శ్రీనివాసులు,
సంబారి ప్రసాద్.

చండీ హోమం ఎందుకు చేస్తారు?
హిందూ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన హోమాలలో చండీహోమం ఒకటి. ఇది దేవి మహాత్మ్యం (దుర్గాసప్తశతి/చండీ పాఠం) ఆధారంగా చేసే హోమం. ఇందులో దేవి చండీ రూపాన్ని ఆరాధిస్తూ 700 శ్లోకాలతో కూడిన దుర్గాసప్తశతిని చదువుతూ అహుతులు సమర్పిస్తారు. ఈ హోమం చేయడం వల్ల శత్రు దోష నివారణ జరిగి, సంపద, ఐశ్వర్యం సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహంతో దుష్టశక్తులు, గ్రహదోషాలు తొలగి, జీవనోపాధి, వ్యాపారంలో రాణిస్తారని వేదపండితులు చెబుతుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో ఈ హోమం చేస్తారు.


website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Earnings

