పద్మశాలీ నిరుద్యోగ యువతకు ఫ్రీ ట్రైనింగ్..

ఇది ఫోటో కాప్షన్

హైదరాబాద్‌: కులాభిమానం ఉన్న వ్యక్తులు అరుదు. తమ కులస్థులను ప్రోత్సహించి, అవసరమైన సాయం చేసి.. జీవనానికి మార్గం చూపే వారు చాలా తక్కువ. తనతో పాటు తన కులస్థులు బాగుండాలని కాంక్షించే వ్యక్తుల్లో ఒకరైన పాపని హేమంత్ కుమార్.. కులస్థులకు సాయపడాలన్న తపనతో.. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ (ఫెయిల్/పాస్) అయిన పద్మశాలీ నిరుద్యోగ యువతకు ‘‘కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసింగ్’’ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన వారిని ప్రామాణికంగా తీసుకుని బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. 

హేమంత్ కుమార్ గురించి క్లుప్తంగా..
వందల మందికి ఉపాధి చూపిన పాపని హేమంత్ కుమార్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట గ్రామం. సత్యనారాయణ, దేవమ్మ దంపతులకు మూడో సంతానమైన హేమంత్‌కు అక్క, చెల్లి ఉన్నారు. హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక కంప్యూటర్ హార్డ్‌వేర్ నేర్చుకోవాలన్న కోరికతో ఆ దిశగా అడుగులు పడ్డాయి. క్రమేణా కంప్యూటర్ సర్వీసింగ్‌లో మంచిపట్టు సాధించారు. సేల్స్‌లో మంచి అనుభవం గడించారు. 25 ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ హేమంత్ కుమార్..అశోక్ నగర్‌లో ‘‘Vintech Computer Pvt. Ltd’’ స్థాపించి శిక్షణ ఇస్తున్నారు. హేమంత్ కుమార్ దగ్గర శిక్షణ పొందిన సుమారు 500 మంది స్వయం ఉపాధితో స్థిరపడ్డారు.

‘‘నా వంతు బాధ్యతగా..’’


‘‘పద్మశాలీ నిరుద్యోగులకు నేను చేయగలిగిన సాయం ఇది. బయట ఇన్‌స్టిట్యూట్లలో ఈ కోర్సుకు దాదాపు రూ.20 వేలు వసూలు చేస్తారు. కులాభిమానంతో నేను మన వాళ్లకు ఉచితంగా చెప్పాలని నిర్ణయించుకున్నా. రెండు మాసాల్లో శిక్షణ పూర్తవుతుంది. ట్రైయినింగ్ పూర్తి చేసుకున్న వారికి టూల్‌కిట్, సర్టిఫికేట్ ఇస్తాం. ఇంటర్న్‌షిప్ కూడా చేయిస్తాం. ఆ తర్వాత నెలకు రూ. 20వేల నుంచి రూ. 30 వేలు సంపాదించవచ్చు. కొంత పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేసి సొంత కాళ్లపై నిలబడొచ్చు.’’
– పాపని హేమంత్ కుమార్ నేత.

ఆసక్తి గల పద్మశాలీ యువత హేమంత్ కుమార్‌ను నేరుగా లేదా ఫోన్‌(9700140787)లో సంప్రదించవచ్చు.
Vintech Computers Pvt Ltd
Door No 3, 2nd floor, House No. 1-1-300/B,
Above HDFC and Canara Bank,
Ashok Nagar, Hyderabad, Telangana 500020
Office Timings : 10am to 8p.m

For Google Location Click on the below photo ..

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

 

Azurancia

Follow us on social media

Related posts