నేడు భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణోత్సవం

కర్నూలు: శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం, నేడు అంగరంగ వైభంగా జరగనుంది. కర్నూలు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో, ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే పద్మశాలీ ప్రముఖులు, నగర అధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పార్లమెంట్ కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, ప్రముఖ ఆర్థోపెడీసియన్ డాక్టర్ అచ్యుతరావు, రాయలసీమ యూనివర్సటీ వైస్ చాన్స్‌లర్ ఊడత వెంకట బసవరావు, డీఐజీ కోయ ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్, బీజేపీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు పోలంకి రామస్వామి, ప్రధాన కార్యదర్శి నారాయణ నాగేశ్వరావుకు ఆహ్వానపత్రికలు అందజేశారు.

కళ్యాణోత్సవంలో భాగంగా చిత్తారి వీధిలోని ఆలయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు శోభయాత్ర మొదలవుతుంది. స్వామి అమ్మవార్లను పల్లకిలో మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌కు తీసుకువస్తారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులు అమ్మవారికి టెంకాయ, ఒడి బియ్యం, రవిక, పసుపు, కుంకుమ తీసుకురావాలని ఆలయ కమిటీ పేర్కొంది. పద్మశాలీ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్, కర్నూలు పద్మశాలీ సంఘం, రాయలసీమ ప్రాంత పద్మశాలీ సంఘం, శ్రీ మార్కండేయ స్వామి సేవా ట్రస్ట్ సహకారంతో జరిగే ఈ కళ్యాణాత్సవాన్ని, విజయవంతం చేయాలని అధ్యక్షులు యర్ననాగు శేషయ్య, ప్రధాన కార్యదర్శి దాసాపతి జయప్రకాష్, కోశాధికారి ఊట్ల రాఘవేంద్ర విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణోత్సవ సమాచారం అందని వారు ఇదే ఆహ్వానంగా భావించి, అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివార్ల ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేస్తున్నారు. Striluxon

Follow us on social media

Related posts