చేనేతమిత్ర ప్రతినిధి: అనంతపురం జిల్లా పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జింకా సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పోతుల లక్ష్మీనరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాయలసీమ ప్రాంత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కొంకతి లక్ష్మీనారాయణ హాజరై నూతన అధ్యక్ష, కార్యదర్శుల పేర్లను ప్రతిపాదించారు. అనంతపురం పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవరకొండ నరసింహులు, రాయదుర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు అరవ శివప్ప, కళ్యాణదుర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకటేశులు, గుంతకల్లు పద్మ శాలి సంఘం అధ్యక్షుడు పాలాది రామసుబ్బయ్య, తాడిపత్రి పద్మశాలి సంఘం సభ్యులు, ఉరవకొండ పద్మశాలి సంఘం సభ్యులు, యాడికి పద్మశాలి సంఘం సభ్యులు, బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘం సభ్యులు, సిండికేట్ నగర్ పద్మ శాలి సంఘం సభ్యులు, గుంతకల్లు పద్మశాలి సంఘం సభ్యులు, డి. హీరేహాల్ పద్మశాలి సంఘం సభ్యులు ఆమోదం తెలిపారు. కొత్త కార్యవర్గ కాల పరిమితి మూడేళ్లు. తర్వలో మిగతా కార్యవర్గ సభ్యుల ఎంపిక ఉంటుందని నూతన అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ప్రస్తుతం జింకా సూర్యనారాయణ టీడీపీ అనంతపురం మండల రూరల్ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.
లక్ష్మీనరసింహులు గురించి క్లుప్తంగా..
2019లో తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. అంతకు ముందు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)లో 2001 నుంచి 2019 వరకు కొనసాగారు. విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలతో కలిసి పనిచేశారు. అనంతపురం టీడీపీ నగర సమన్వయ కమిటీ సభ్యుడిగా, టీడీపీ బీసీ సెల్ నగరాధ్యక్షుడిగా, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు చేపట్టారు. పార్టీ తరుపున కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండల పరిశీలకుడిగా, అలాగే పార్టీ ఆదేశాల మేరకు నియోజక వర్గాల్లో టీడీపీ శ్రేణులకు శిక్షణ కూడా ఇచ్చారు. లక్ష్మీనరసింహ సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించింది. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు.
‘‘పద్మశాలిలు రాజకీయంగా రాణించాలి’’
పద్మశాలియులు రాజకీయాల్లోనూ రాణించాలని కొంగతి లక్ష్మీనారాయణ కులస్థులను కోరారు.‘‘ బీసీలలో సగభాగం చేనేత కులాల వారే ఉన్నారని, జనాభా ప్రాతిపదికన రాజకీయాలలో మన వాటా కోసం శక్తి వంచన లేకుండా పోరాడాలి. కొత్తగా ఏర్పడిన జిల్లాలోనూ నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు.



కార్యక్రమంలో సలహాదారులు జయరపు చంద్రశేఖర్, నాగమల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి నారాయణ వెంకటనారాయణ, నాగమల్లు విశ్వ ప్రసాద్, జానపాటి సత్యనారాయణ, వేల్పుల సాయికుమార్, మహిళ పద్మశాలి సంఘసభ్యులు నీలిశ్రీ వాణి, గంజి మోహన్ కుమార్, కాలువ గోపాల్, ఉట్ల రమేష్ బాబు, అనంతపురం నగర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవరకొండ నరసింహులు, ప్రధాన కార్యదర్శి గోరంట్ల చలపతి పాల్గొన్నారు. Bay Assetholm


