ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని ఏపీ పద్మశాలీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ జింకా విజయలక్ష్మి పేర్కొన్నారు. బీసీ కులాల కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్‌పర్సన్లు, డైరెక్టర్లను నవంబర్ 3వ తేదీన కడపలో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్ర రెడ్డి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జింకా విజయలక్ష్మి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నో రెట్లు మేలన్నారు. చంద్రబాబు హయంలో బీసీ కులాలన్నిటికి కలిసి ఒకే కార్పొరేషన్ ఉండేదని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం లోటు బడ్బెట్‌లో ఉన్నా, నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని..అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తూ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని తెలిపారు. కార్పొరేషన్ పదవుల్లో 50 శాతం పదవులను మహిళలకే కేటాయించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి బీసీలంతా అండగా నిలవాలని కోరారు. తాను కూడా చేనేతల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చివరగా తనకు చైర్‌పర్సన్ పదవి రావడానికి సహకరించిన ఎంపీ, ఎమ్మెల్యే అలాగే ఉపముఖ్యమంత్రి, మిగతా శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ గోదెన నాగలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలిచారని కొనియాడారు. బీసీల అభ్యున్నతికి ఆయన కట్టుబడి ఉన్నారని తెలిపారు. చేనేతలు, దేవాంగుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని నాగలక్ష్మి పేర్కొన్నారు. తనకు డైరెక్టర్ పదవి రావడానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.


website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Xtradegrok 8.1 Flex

