అట్టహాసంగా పేవా అనంతపురం జిల్లా కార్యవర్గ ఎన్నిక..

పద్మశాలీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఆదివారం (జూన్ 16న) జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని తపోవనంలో ఏర్పాటు చేసిన సంఘ సర్వసభ్య సమావేశంలో సభ్యులు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా  కొంతం శివ రుదప్ర్ప, ప్రధాన కార్యదర్శిగా శీల వెంకటస్వా మి, కోశాధికారిగా  బసపతి సురేష్ వ్యవహరించనున్నారు. కమిటీ కాలపరిమితి మూడు సంవత్సరాలు (2024 నుంచి 2027 వరకు). ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పేవా కడప జిల్లా అధ్యక్షులు గుణిశెట్టి శ్రీనివాసులు, ఎన్నికల పరిశీలకులుగా పేవా సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఊట్ల నరేంద్ర, పేవా  రాష్ట్ర కోశాధికారి తాడూరు చందశ్రేఖర్ నూతన కమిటీని ప్రకటించారు. ఇదే సమావేశంలో మహిళా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేవా అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మఠం ప్రసన్న లక్ష్మి, కార్యదర్శిగా శీల…

PEWA అనంతపురం జిల్లా నూతన కమిటీ ఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు

పద్మశాలీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (పేవా) అనంతపురం శాఖ సర్వసభ సమావేశం అనంతపురంలో జరగనుంది. మార్కండేయ స్వామి దేవస్థానం(తపోవనం)లో ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లా నూతన కమిటీ (2024 – 2027 ), మహిళా కమిటీని ఎన్నుకుంటారు. జిల్లా అధ్యక్షులు కొంతం శివ రుద్రప్ప తొలి పలుకులతో సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధాన కార్యదర్శి బసపతి సురేష్ బాబు ప్రగతి నివేదిక చదివి వినిపిస్తున్నారు. మెంబర్‌షిప్ డ్రైవ్, సభ్యత్వం పొందిన వారి సంఖ్య, సంఘం నిర్వహించిన కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరిస్తారు. అనంతరం ఆర్థిక నివేదికపై చర్చ ఉంటుంది. జమా ఖర్చుల వివరాలను సమావేశం ముందుంచుతారు. చివరగా నూతన కమిటీ (2024 – 2027 ) ఎన్నిక ఉంటుంది. ఎన్నికల అధికారిగా పేవా కడప జిల్లా అధ్యక్షులు డాక్టర్. గునిశెట్టి శ్రీనివాసులు, పరిశీలకులుగా సత్యసాయి…