
పద్మశాలీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఆదివారం (జూన్ 16న) జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని తపోవనంలో ఏర్పాటు చేసిన సంఘ సర్వసభ్య సమావేశంలో సభ్యులు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొంతం శివ రుదప్ర్ప, ప్రధాన కార్యదర్శిగా శీల వెంకటస్వా మి, కోశాధికారిగా బసపతి సురేష్ వ్యవహరించనున్నారు. కమిటీ కాలపరిమితి మూడు సంవత్సరాలు (2024 నుంచి 2027 వరకు).

ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పేవా కడప జిల్లా అధ్యక్షులు గుణిశెట్టి శ్రీనివాసులు, ఎన్నికల పరిశీలకులుగా పేవా సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఊట్ల నరేంద్ర, పేవా రాష్ట్ర కోశాధికారి తాడూరు చందశ్రేఖర్ నూతన కమిటీని ప్రకటించారు.

ఇదే సమావేశంలో మహిళా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేవా అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మఠం ప్రసన్న లక్ష్మి, కార్యదర్శిగా శీల సునీత, కోశాధికారిగా జలదుర్గం పద్మజను ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్ర మహిళా ప్రతినిధిగా రంగా సుభాషిణి రాజ్యలక్ష్మిని ఎన్నుకున్నారు.
సమావేశానికి ముఖ్య అతిథులుగా జింక సూర్యనారాయణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు, కార్యదర్శి పోతుల నరసింహులు, మాజీ అధ్యక్షులు పొడరాల రవీంద్ర, నగర సంక్షేమ సంఘం కార్యదర్శి గుర్రం యుగంధర్, ఆంధప్రద్రేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గండబతుల సుజాత హాజరయ్యారు.
సన్మాన గ్రహీతలు వీరే..
నీట్ పరీక్షలో 693 మార్కులు సాధించి మెడిసిన్ సీటుకు అర్హత పొందిన గుర్రం రామచైతన్య కు మెమెంటో అందజేసి ప్రోత్సహించారు. ఉద్యోగ విరమణ చేసిన గోరంట్ల శ్రీనివాసులు (సేల్స్ టాక్స్ డిపార్టుమెంట్), ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొందిన శిరసాల నిర్మల, వైద్య రంగంలో సేవలకుగాను డాక్టర్ నూకల విజయ రామయ్య, ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వాహకులు కాలువ సుబ్బరాయుడు, పేవాకు సేవలందిస్తున్న దేవిరెడ్డి రాము, పదోన్నతి పొంది బదిలీ అయిన యూనియన్ బ్యాంకు మేనేజరు పొబ్బతి ప్రసాద్‌ను సన్మానించారు.

ధన్యవాదాలు తెలిపిన అధ్యక్షులు..
జిల్లాలో ఇప్పటికే పేవాలో మెంబర్ షిప్ డ్రైవ్ కొనసాగుతోందని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని శివ రుద్రప్ప తెలిపారు. పేవా నూతన కార్యవర్గ ఎన్నికకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
భోజనానికి సహకరించిన పొడరాళ్ల చౌడేశ్వరి ప్రసాద్ హెడ్మాస్టర్ బుక్కరాయసముద్రం, సన్మాన గ్రహీతలకు శాలువాలను బహుకరించిన పబ్బతి ప్రసాద్‌కు అనంతపురం పేవా తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. సమావేశం విజయవంతం కావడంపై రాష్ట్ర అధ్యక్షులు జివి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Avex Pro 2.0

