కరీంనగర్: కరీంనగర్ జిల్లా గర్శకుర్తిలో ‘‘నేతన్న వెతలపై చర్చాగోష్టి’’ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆదివారం (జూన్ 17) చేనేత ఐక్య వేదిక మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిందం సునీత అధ్యక్షతన, వస్త్రోత్పత్తి వ్యాపారులు, కార్మిక, పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు.
సమస్యలు సీఎం దృష్టికి..
‘‘రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి చేతినిండా పని కరువైంది. 8 నెలలుగా పవర్ లూమ్స్ నుంచి వస్ర్త ఉత్పత్తులు నిలిచిపోయాయి. వాటి యజమానులు, కార్మికులను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తక్షణమే వారికి పనులు కల్పించాలి. అలాగే జియోట్యాగ్ విధానాన్ని రద్దు చేయాలి. త్రిప్ట్ పథకం కింద ఎనిమిది మాసాలుగా డబ్బులు జమకావడం లేదు. సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమ, పవర్ లూమ్స్ యజమానులపై విజిలెన్స్ దాడులు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నేతన్నల సమస్యలను తెలుసుకుంటాం. చేనేత కార్మికుల ఇబ్బందులపై సమగ్ర ఒక నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తాం. సమస్యల పరిష్కారానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చేవరకు పోరాడతాం.’’
– రాపోలు వీరమోహన్.

సమావేశంలో ఐక్యవేదిక రాష్ట్ర, జిల్లాల నాయకులు సదానందం శ్రీని వాస్, వెంకటేశ్వర్లు, మైసయ్య, ఆశన్న, శ్రీనివాస్, చిరంజీవి, భాస్కర్, నారాయణ, లక్ష్మీ నారాయణ, సురేశ్, నాగన్న, కోటేశ్వరరావు, శారద, రమాదేవి, పద్మ, నీరజ, చిందం రాజ మౌళి, విఠోభ, మాజీ సర్పంచ్ మహేశుని ఈశ్వరయ్య, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Prämie Invexus


