కోట దామోదర్‌కు ‘తెలుగు వెలుగు లెజండరీ’ పురస్కారం

 చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌రచయిత, కాలమిస్ట్ ‌కోట దామోదర్‌కు అరుదైన గౌరవం దక్కింది. పత్రిక వ్యాసరచన రంగంలో ఆయన ‘తెలుగు వెలుగు లెజండరీ’ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు వెలుగు సాహితీ వేదిక ఇటీవల హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గాన సభ, కళా దీక్షితులు కళా వేదిక చిక్కడపల్లిలో తెలుగు వెలుగు జాతీయ పురస్కారాల మహోత్సవం నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాచకొండ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌రావుల గిరిధర్‌, అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ అఫ్‌ ‌పోలీస్‌, ‌స్టేషన్‌ ‌ఘన్‌ ‌పూర్‌ ‌దురిశెటీ రఘుచందర్‌, ‌సరస్వతి మాత ఉపాసకులు దైవజ్ఞ శర్మ, కవి రచయిత నేదునూరి కనకయ్య, పలువురు ప్రముఖులు విచ్చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలోని వివిధ రంగాల నుంచి ఎంపిక చేసిన పలువురికి ముఖ్యఅతిథులు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన కోట దామోదర్‌ ‌పురస్కారాన్ని అందుకోవడం పట్ల ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కోట దామోదర్‌ ‌మాట్లాడుతూ పురస్కారాన్ని అందుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. పురస్కారాన్ని అందజేసిన ముఖ్య అతిథులకు, కార్యక్రమానికి విచ్చేసిన వారికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.

కోట దామోదర్‌ ‌రాసిన పలు వ్యాసాలు వివిధ దిన పత్రికలలో అచ్చయ్యాయి. నేతన్నలను ఆదుకోరా? చేయూతలేని చేనేత..శీర్షికలతో ‘దిశ‘ దినపత్రికలో ప్రచురితమైన వ్యాసాలలో నేతన్నల దుస్థితిని వివరిస్తూ..ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Investrax 3.0

Follow us on social media

Related posts