మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించినపుడే సమాజాభివృద్ధి జరిగినట్లని కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 5వ తేదీ ఆమె కర్నూలు నగరంలో పర్యటించారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 19వ వార్డులో వైసీపీ అభ్యర్థి బీవై రామయ్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నిబెట్టుకున్నారని తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందినట్లని నమ్మిన వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సౌకర్యాలు సమకూర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. కార్పొరేటర్ అభ్యర్థి రామయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ అభ్యర్థి బీవై రామయ్య, మాజీ కార్పొరేటర్ సుధ, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

46వ వార్డులో ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మార్చి 5వ తేదీ 46వ వార్డు నరసింహ రెడ్డి నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్‌ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు.
అంతకుముందు రోజు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక కర్నూలు నగరంలోని 17వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి కైప పద్మాలతను గెలిపించాలని ఆమె ఆదిత్య నగర్ , మయూరి హోమ్స్, జోహారాపురం రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. Zignalor


