ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై)

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై)

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై) భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రమాద బీమా పథకం. బీమా చేయని జనాభాను బీమా పరిధిలోకి తీసుకురావడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకంలో సంవత్సరానికి రూ .12 / – మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఈ పథకానికి 18-70 సంవత్సరాల వయస్సులోపు ఉండి బ్యాంకులో పొదుపు ఖాాతా ఉండాలి. ఈ పథకాన్ని ఏటా పునరుద్ధరించవచ్చు. ఇది బలహీన వర్గాలకు తక్కువ ధర గల పాలసీ. వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి బీమా సంస్థ డబ్బు చెల్లిస్తుంది.

బీమా యోజన అర్హత  – కవరేజ్

ఏదైనా ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ. 2 లక్షలు ఇస్తారు.
శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ . 2 లక్షలు చెల్లిస్తారు.
పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ . 1 లక్షలు చెల్లిస్తారు.
ఆత్మహత్య ప్రమాద పరిధిలోనికి రాదు.

PMSBY బ్యాంకుల జాబితా 

అలహాబాద్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
భారతీయ మహిలా బ్యాంక్
కెనరా బ్యాంక్
కేంద్ర బ్యాంకు
కార్పొరేషన్ బ్యాంక్
దేనా బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
ఐసిఐసిఐ బ్యాంక్
ఐడిబిఐ బ్యాంక్
ఇండస్ఇండ్ బ్యాంక్
కేరళ గ్రామీణ బ్యాంక్
కోటక్ బ్యాంక్
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
సౌత్ ఇండియన్ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్
సిండికేట్ బ్యాంక్
యుకో బ్యాంక్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
విజయ బ్యాంక్

ఎలా నమోదు చేయాలి?

బీమా కోసం ఫారమ్‌ను పూరించి బ్యాంకర్‌కు సమర్పించాలి. కొన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్ ఆధారిత నమోదు ప్రక్రియను మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాయి.

రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఆన్‌బోర్డింగ్ సంస్థ టోల్ ఫ్రీ నంబర్‌కు SMS పంపడం ద్వారా కూడా ప్రారంభించవచ్చు.
స్టెప్1 -: టోల్ ఫ్రీ నం.కి SMS ను పంపండి
స్టెప్ 2 :’PMSBY Y’ అని టైప్ చేసి యాక్టివేషన్ SMS కు ప్రత్యుత్తరం ఇవ్వండి.
స్టెప్ 3 -:మనం పంపిన మెసేజ్ వారికి చేరినట్లు అంగీకరిస్తూ మీకు సందేశం వస్తుంది.
స్టెప్ 4 – మన పొదుపు ఖాతా ఉన్న సంబంధిత బ్యాంక్ లో ఈ ప్రక్రియ నిర్వహిస్తుంది.

నమోదుకు అవసరమైన పత్రాలు

పేరు, చిరునామా వివరాలు, ఆధార్ నంబర్, నామినీ వివరాలు, పిఎంఎస్‌బివై దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. సమాజంలోని అన్ని వర్గాలకు చెందినవారు దీనికి అర్హులే. ఆధార్ కార్డు – దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు వివరాలు పేర్కొన్న పొదుపు బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడకపోతే, అతడు / ఆమె ఆధార్ కార్డు కాపీని సమర్పించాలి. దరఖాస్తు ఫారంతో పాటు ఇది అవసరం. Záloha Valnex

Follow us on social media

Related posts

Leave a Comment