బీసీల అభ్యున్నతి కోసం ఆంధప్రదేశ్ ప్రభుత్వం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ల చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లను అక్టోబర్ 18వ తేదీ తాడేపల్లిలో ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకుగాను ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు. చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పించారు.
కార్పొరేషన్ల చైర్మన్ల పేర్లు..
రజక కార్పొరేషన్: రంగన్న (అనంతపురం), కురుబ కార్పొరేషన్ : కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం), తొగట కార్పొరేషన్ : గడ్డం సునీత (అనంతపురం), కుంచిటి వక్కలిగ : డా.నళిని(అనంతపురం), వన్యకుల క్షత్రియ : కె. వనిత (చిత్తూరు), పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు), ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు), ఈడిగ: కె.శాంతి (చిత్తూరు), గాండ్ల : భవాణీ ప్రియ (తూర్పు గోదావరి), పెరిక: పురుషోత్తం గంగాభవానీ (తూర్పు గోదావరి), అగ్నికుల క్షత్రియ: భండన హరి(తూర్పు గోదావరి), అయ్యారక : రాజేశ్వరం (తూర్పు గోదావరి), షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు), వడ్డెర : దేవల్లి రేవతి (గుంటూరు), కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు), కృష్ణ బలిజ/పూసల: కోలా భవాణీ (గుంటూరు), యాదవ: హరీష్‌కుమార్ (కడప), నాయీబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప), పద్మశాలీ: విజయలక్ష్మి (కడప), నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి (కడప), సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప), విశ్వ బ్రాహ్మణ: తోలేటి శ్రీకాంత్ (కృష్ణ), గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణ), వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణ), భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణ), వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు), కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు), వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు), ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు), జంగం: ప్రసన్న (నెల్లూరు), బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు). ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు), చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం), ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం), దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం), మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం), కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం), కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం), రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం), పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం), కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం), శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం), మత్స్యకార : కోలా గురువులు (విశాఖ), గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ), నగరాల: పిల్లా సుజాత (విశాఖ), యాత: పి.సుజాత (విశాఖ), నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ), తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం), కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం), శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం), దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం), సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమ గోదావరి), శెట్టి బలిజ: తమ్మయ్య (పశ్చిమ గోదావరి), అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (పశ్చిమ గోదావరి), అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు (పశ్చిమ గోదావరి).
ఏపీలో బీసీ కార్పొరేషన్లు – చైర్మన్లు
