కరోనా వారియర్స్ కు సన్మానం – వానపల్లి రవికుమార్‌ను సత్కరించిన అతిథులు

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు సేవలందించిన పలువురిని వైజాగ్‌ విజన్‌ ఛానెల్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. అక్టోబర్‌ 18వ తేదీ విశాఖపట్నం పౌర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూజ ఫౌండేషన్‌ చైర్మన్‌, మాజీ కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్‌ను ముఖ్య అతిథులుగా హాజరయిన సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు గారు, వీజేఎఫ్‌ అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు, వీజేఎఫ్‌ కార్యదర్శి సీహెచ్‌ దుర్గా రావు, జీవీఎంసీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ రాం కుమార్‌ ఘనంగా సన్మానించారు. లాక్‌డౌన్‌ సమయంలో వానపల్లి రవికుమార్‌ అనాథలు, అభాగ్యులు, వలస కూలీలకు వరుసగా 83 రోజుల పాటు భోజనం, నీళ్ల ప్యాకెట్లను అందజేశారు. గతంలోనూ జీవీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శాస్త్రి, అడిషనల్‌ కమిషనర్‌ నుంచి రవికుమార్‌ స్వచ్‌ సర్వెక్షన్‌ అవార్డును అందుకున్నారు. Index Lidex Pro

Follow us on social media

Related posts

Leave a Comment