క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. దరఖాస్తు చేసుకోండి ఇలా ..

ఆధార్‌ కార్డు డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్సు ‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్‌ను పొందొచ్చు. పది రోజుల్లో కొత్త ఆధార్‌ కార్డు మీ ఇంటికి చేరుతుంది.

క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. అప్లై ఇలా..

◆ పీవీసీ ఆధార్‌ కార్డు అప్లయ్‌ చేసేందుకు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

◆ గెట్‌ ఆధార్‌ అనే చోట Order Aadhaar PVC Card అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి.

◆ అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆధార్‌ కార్డు తాలూకా వర్చువల్‌ ఐడీని గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ అయినా ఎంటర్‌ చేయొచ్చు.

◆ క్యాప్చా కోడ్‌, మీ ఆధార్‌తో లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

◆ మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయండి.

◆ ఆ తర్వాతి పేజీలో మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.

◆ పేమెంట్‌ పేజీలోకి వెళితే మీకు అక్కడ క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. యూపీఐ ఆప్షన్స్‌లోకి వెళితే పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే, అమెజాన్‌ పేను ఉపయోగించి పేమెంట్‌ చేయొచ్చు.

◆ పేమెంట్‌ పూర్తయిన తర్వాత మీకు ఓ రసీదు వస్తుంది. అందులో ఎస్‌ఆర్‌ఎన్‌ నంబర్‌ను భవిష్యత్‌ అవసరాల కోసం సేవ్‌ చేసి పెట్టుకోండి.

◆ పది రోజుల్లో మీ అడ్రస్‌కు కొత్త ఆధార్‌ కార్డు వెళుతుంది. ఆధార్‌ కార్డు స్టేటస్‌ తెలుసుకోవాలంటే ఎస్‌ఆర్‌ఎన్‌ నంబర్‌ను ఉపయోగించి ఉడాయ్‌ వెబ్‌సైట్‌లో గెట్‌ ఆధార్‌ విభాగంలో స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. Cesta Evocorex

Follow us on social media

Related posts

Leave a Comment