శ్రీవారి సేవకులకు శిక్షణ.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?

తిరుపతి: తిరుమల..ఈ పేరు వింటేనే మనసు పులకరిస్తుంది. భక్తిభావంతో ఉప్పొంగుతుంది. తిరుమలేశుడి దర్శనంతో జన్మచరితార్థం అని భావించే భక్తులు కొందరైతే.. వెంకన్న సన్నిధిలో భక్తులకు సేవ చేస్తే ఆది స్వామివారికి చేసినట్టేనని భావించే భక్తులు మరికొందరు. రోజూ వేల సంఖ్యలో తిరుమలలో వలంటీర్లుగా సేవలందిస్తుంటారు. అయితే మరింత నాణ్యమైన సేవలందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వలంటీర్లకు శిక్షణ ఇచ్చే శ్రీవారి సేవకులకు ముందుగా ట్రైనింగ్ ఇవ్వనుంది. వీరికి ఐఐఎం అహ్మదాబాద్, రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. సేవలో పాల్గొనాలనుకునే ప్రొఫెషనల్స్, ఎన్‌ఆర్‌ఐలకూ ప్రణాళిక సిద్ధమవుతోంది. ఏ అంశాలపై శిక్షణ ఇస్తారు? శ్రీవారి సేవకులు శిక్షణ కోసం ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విడత శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై మూడు రోజుల…

అఖిల భారత పద్మశాలీ మహాసభ ఆవిర్భావ దినోత్సవ సమావేశం..

ప్రసంగిస్తున్న తడక యాదగిరి
ప్రసంగిస్తున్న తడక యాదగిరి

ప్రసంగిస్తున్న తడక యాదగిరి చేనేతమిత్ర ప్రతినిధి: అఖిల భారత పద్మశాలీ మహాసభ ఏర్పడి 104 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పద్మశాలీయులు ఆదివారం(జూన్22న) పుల్లంపేటలో సమావేశమయ్యారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మశాలీ కుల సంఘ పరిశోధకులు తడక యాదగిరి, నూకల వెంకటసుబ్బయ్య మనవడు శ్రీరాములు, డా. చలమయ్య, సామల సుబ్బరాయుడు, కొత్తపేట సర్పంచ్ మణికంఠ, పొలిచెర్ల వెంకటేశ్వర్లు, పద్మాంజలి ఎడిటర్ బుస్సా వెంకటసుబ్బయ్య, కులస్థులు పాల్గొన్నారు. పద్మశాలీయుల శ్రేయస్సుకు దివంగత వడ్డేపల్లి విఠోభ, గుంటక నర్సయ్య పంతులు, కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి, అలాగే వారి సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న గుండేటి శ్రీధర్ 1921లో తొలి మహాసభ.. అఖిల భారత పద్మశాలీ తొలి మహాసభ కడప జిల్లా పుల్లంపేట గ్రామంలో జరిగింది. కార్యంపూడి వెంకటకృష్ణకవి మార్గదర్శకత్వంలో దివంగత నూకల వెంకటసుబ్బయ్య కృషితో…

ఘనంగా కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక జన్మదిన వేడుకలు..

చేనేతమిత్ర ప్రతినిధి : ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో శనివారం (జూన్ 21వ తేదీ) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి బుట్టా రేణుకకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు.. బుట్టా రేణుక జన్మదినం సందర్భంగా వైసీపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేశప్ప ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుట్టా రేణుకకు దీర్ఘాయుషు ప్రసాదించి  ప్రజాసేవకు మరింత శక్తి సామర్థ్యాలతో ముందుకు నడిపించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు డి. నజీర్ అహ్మద్, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ఎం.కె. శివప్రసాద్,…

నంద్యాలలో ఘనంగా ‘ప్రతిభకు పట్టాభిషేకం’

2024-25 సంవత్సరానికి టెన్త్, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఆదివారం (జూన్ 1వ తేదీ) అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలోని భద్రావతి భావన ఋషి దేవాలయ కళ్యాణ మండపం‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పదో తరగతిలో మొదటి, రెండో, మూడో విజేతగా నిలిచిన జేరుబండి హారిక, కోటా సంజయ్‌, తాటికొండ సాయి సందేష్‌కు వరుసగా రూ.10వేలు, రూ.7,500, రూ. 5వేలు అందజేశారు. అలాగే ఇంటర్మీడియట్‌లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన చేపూరి క్రిష్ణ చైతన్య, దండు స్వీకృతి, గడ్డం సాయి మణిదీప్‌కి వరుసగా రూ.10వేలు, రూ.7,500, రూ. 5వేలు అందజేశారు. కన్సోలేషన్ బహుమతిగా 110 మంది విద్యార్థులకు ఒక్కొక్కరిని రూ. 2వేల చొప్పున నగదు, ప్రశంసా పత్రం, మెమొంటో…

తెలంగాణ సాధన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి నేడు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం  కొండా లక్ష్మణ్‌ బాపూజీ  జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ సారి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27న బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించే బాధ్యతను బీసీ సంక్షేమ శాఖకు అప్పగించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే ఉత్సవాలకు ప్రభుత్వం రూ. 15 లక్షలు కేటాయించింది. ఉత్సవ ఆహ్వాన కమిటీని కూడా ఎంపిక చేసింది ప్రభుత్వం. కమిటీలో 49 మందికి స్థానం కల్పించారు. గౌరవ అధ్యక్షుడిగా ఇవరాత్రి అనిల్, అధ్యక్షుడిగా కామర్తపు మురళి, మరో నలుగురు ముఖ్య సలహాదారులుగా, 43 మందిని ఉపాధ్యక్షులుగా స్థానం కల్పించారు. బాపూజీ గురించి క్లుప్తంగా.. నియంతృత్వ భూస్వామ్య నిజాం పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో యువ కార్యకర్తగా రాజకీయ జీవితం…

చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ

హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రేపు నేతన్నలతో సమావేశమవుతున్నారు. చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ అధ్యక్షతన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనతో పాటు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. రూ. 90 కోట్లు విలువ చేసే త్రిఫ్ట్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూం టెక్నాలజీ (IIHT) కోర్సులకు సంబంధించి తరగతులను ప్రారంభిస్తారు. చేనేతల కోసం కొత్త పథకాలను కూడా ప్రకటిస్తారు. చేనేత సమాజం నుంచి కొన్ని డిమాండ్ల చాలా కాలంగా వినిపిస్తున్నాయి. వాటిలో కొన్ని.. 1. చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ. 2. చేనేత ఉపకులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించడం 3. 3…

టీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లకటి రాజ్ కుమార్..

తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టీఆర్‌పీఎస్) అధ్యక్షుడిగా వల్లకటి రాజ్ కుమార్ గెలుపొందారు. బూర మల్లేశంపై ఆయన 13,401 ఓట్ల మెజార్టీ సాధించారు. ఎన్నికలలో రాజ్ కుమార్‌కు మగ్గం గుర్తు, బూర మల్లేశానికి రాట్నం గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. పోలింగ్ ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపు సోమవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటలకు కొనసాగింది. ఎన్నికల అధికారులుగా రవిరాల నర్సయ్య, భువనగిరి ఉదయ్ కుమార్, మాచర్ల రంగయ్య వ్యవహరించారు. ఫలితాల వివరాలు.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు : 101 పోల్ అయిన ఓట్లు : 27,154 చెల్లనివి : 161 వాలిడ్ ఓట్లు : 26, 967 రౌండ్లు : 6 బూర మల్లేశానికి పోలైన ఓట్లు ఓట్లు : 6,796 వల్లకటి…

నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్..

ఏపీలో సదరం క్యాంపులు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. మూడు మాసాలకు (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) ఒకేసారి స్లాట్స్  విడుదల చేస్తున్నారు. ఇవి గురువారం నుంచి ఓపెన్ అవుతాయి. బుద్ధిమాంద్యం, చెవుడు, మూగ, అంగ వైకల్యంతో బాధపడుతున్న వారు మీసేవ, గ్రామ, వార్డు సచివాలలో స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న తేదీన సదరం క్యాంపునకు హాజరుకావాల్సి ఉంటుంది. వైద్యులు పరీక్షలు నిర్వహించి వైకల్య శాతాన్ని నిర్ధారిస్తారు. వారిచ్చి సర్టిఫికేట్ ఆధారంగా  వైకల్య పింఛన్ పొందవచ్చు. Avex Pro 2.0

టీటీడీ ఈవోను సన్మానించిన పేవా సభ్యులు

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జంజనం శ్యామలరావును పద్మశాలీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (PEWA) ఏపీ కార్యవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన శ్యామల రావు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా  పేవా రాష్ట్ర అధ్యక్షులు  GVS రామకృష్ణ,  ప్రధానకార్యదర్శి  KVV సత్యనారాయణ, కోశాధికారి  T చంద్రశేఖర్, తిరుపతి జిల్లా అధ్యక్షులు  AV సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి  S.పరం దామయ్య, రాష్ట్ర కార్యదర్శులు S నాగేశ్వరరావు, Dr. శ్రీనివాసరావు, మహిళా విభాగం కార్యదర్శి  B.సునీత, ఏలూరు జిల్లా అధ్యక్షులు  SV సత్యనారాయణ, SHAR ఉద్యోగులు   G.వెంకటేశ్వర్లు, B వీరభద్రం, కిరణ్ కుమార్, N.చంద్రశేఖర్, గుణ సాయి, M.మస్తాన్,Ch. సుబ్రహ్మణ్యం (వెంకటగిరి) తదితరులు ఈవోకు శాలువ కప్పి సన్మానించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు  తిరుమల ప్రక్షాళనకు…

‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ నవలకు రాష్ట్ర స్థాయి పురస్కారం

హైదరాబాద్ : తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు 2024 సంవత్సరానికి గాను తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రకటించింది. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య  వివరాలు వెల్లడించారు. పద్య, గేయ కవిత్వంలో రాచాలపల్లి బాబు దేవిదాస శర్మ రచించిన ‘శ్రీరామాయణోపనిషత్తు’, వచన కవితలో తోట నిర్మలా రాణి అద్దం నా చిరునామా కాదు బహుమతులను గెలుచుకున్నాయి. అలాగే నవలా ప్రక్రియలో డాక్టర్ వెన్నం ఉపేందర్ రచించిన ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ గ్రంథం, సాహిత్య విమర్శలో బండారి రాజ్ కుమార్ రచించిన ‘తెలంగాణ కవి ముద్ర’ గ్రంథం , కథ ప్రక్రియ లో డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన ‘కండిషన్స్ అప్లై’ గ్రంథం పురస్కారానికి ఎంపికయ్యాయని వివరించారు. అభినందనీయం.. ‘‘గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన…