తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టీఆర్‌పీఎస్) అధ్యక్షుడిగా వల్లకటి రాజ్ కుమార్ గెలుపొందారు. బూర మల్లేశంపై ఆయన 13,401 ఓట్ల మెజార్టీ సాధించారు. ఎన్నికలలో రాజ్ కుమార్‌కు మగ్గం గుర్తు, బూర మల్లేశానికి రాట్నం గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. పోలింగ్ ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపు సోమవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటలకు కొనసాగింది. ఎన్నికల అధికారులుగా రవిరాల నర్సయ్య, భువనగిరి ఉదయ్ కుమార్, మాచర్ల రంగయ్య వ్యవహరించారు.

ఫలితాల వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు : 101
పోల్ అయిన ఓట్లు : 27,154
చెల్లనివి : 161
వాలిడ్ ఓట్లు : 26, 967
రౌండ్లు : 6
బూర మల్లేశానికి పోలైన ఓట్లు ఓట్లు : 6,796
వల్లకటి రాజ్ కుమార్‌కు పోలైన ఓట్లు : 20,197
రాజ్ కుమార్‌కు వచ్చిన మెజారిటీ : 13,401
పోటాపోటీగా ఎన్నికలు..
ప్రజాస్వామబద్ధంగా కమిటీ ఎన్నిక కావాలన్నది తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపకులు రామ శ్రీనివాస్ ఎప్పుడూ భావించేవారు. ఆయన జీవించి ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కలియ తిరిగారు. ప్రతిజిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు.

ఉత్కంఠ భరితంగా ఫలితాలు..
మొత్తం ఆరు రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. మొదటి రౌండ్ నుంచే ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అన్ని రౌండ్లు ముగిశాక రాజ్ కుమార్ గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

రాజ్ కుమార్‌కు శుభాకాంక్షలు..
రాజ్ కుమార్ గెలుపుపై వివిధ పద్మశాలీ కమిటీ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలో రాజ్ కుమార్‌తో దిగిన ఫోటోలతో ఆయనకు విషస్ చెబుతున్నారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల తేదీ ప్రకటించిన రోజు నుంచి వీరమోహన్ ఆయన వెన్నంటి ఉన్నారు. కొన్ని జిల్లాలో రాజ్ కుమార్ వెంట ప్రచారంలో పాల్గొన్నారు. 33 జిల్లాలోని కమిటీ సభ్యులకు రాజ్ కుమార్ గురించి వివరించి వారి మద్దతు కూడగట్టారు. రాజ్ కుమార్ విజయంపై పలువురు ఐక్యవేదిక కమిటీ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో రాజ్ కుమార్‌తో దిగిన ఫోటోలతో ఆయన విషస్ చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షులు తిరందాస్ ధనుంజయచ ప్రచార కార్యదర్శి గుజ్జ అశోక్, ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి ( యువజన విభాగం ) జెల్ల రఘు తదితరులు రాజ్ కుమార్ కు హర్షం వ్యక్తం చేశారు.

చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika
పద్మశాలీయుల అభ్యున్నతి, ఐక్యత కోసమే టీఆర్‌పీఎస్: రామ శ్రీనివాస్
రామ శ్రీనివాస్ గారిని ఒకసారి గుర్తు చేసుకుందాం
వివరాలకు దిగువన ఉన్న రామ శ్రీనివాస్ ఫొటోపై క్లిక్ చేయండి..



