తెలంగాణ సాధన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి నేడు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం  కొండా లక్ష్మణ్‌ బాపూజీ  జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ సారి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27న బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించే బాధ్యతను బీసీ సంక్షేమ శాఖకు అప్పగించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే ఉత్సవాలకు ప్రభుత్వం రూ. 15 లక్షలు కేటాయించింది. ఉత్సవ ఆహ్వాన కమిటీని కూడా ఎంపిక చేసింది ప్రభుత్వం. కమిటీలో 49 మందికి స్థానం కల్పించారు. గౌరవ అధ్యక్షుడిగా ఇవరాత్రి అనిల్, అధ్యక్షుడిగా కామర్తపు మురళి, మరో నలుగురు ముఖ్య సలహాదారులుగా, 43 మందిని ఉపాధ్యక్షులుగా స్థానం కల్పించారు.

బాపూజీ గురించి క్లుప్తంగా..
నియంతృత్వ భూస్వామ్య నిజాం పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో యువ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన బాపూజీ.. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన తరగతుల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, స్వాతంత్ర్యోద్యమం, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు చేసిన బహుముఖ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.

చివరి దశ తెలంగాణ ఉద్యమంలో పెద్ద దిక్కుగా బాపూజీ..
ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడిలో కొండా పోశెట్టి, అమ్మక్కలకు 1915 సెప్టెంబర్ 27 న జన్మించిన బాపూజీ 97 సంవత్సరాలు జీవించి 2012, సెప్టెంబర్ 21 న తుదిశ్వాస విడిచారు. మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచిన బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్యమ రూపంలో ముందుకు వచ్చిన అన్ని సందర్భాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. 1956లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును ప్రతిఘటించిన ఉద్యమంలో, 1960 దశాబ్దాల చివరి నాళ్లలో పెద్ద ఎత్తున తలెత్తిన ఉద్యమంలో 1995లో ముందుకు వచ్చిన రెండో దశ తెలంగాణ ఉద్యమంలో, చివరి దశ తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పెద్ద దిక్కుగా ఉన్నారు.

రాజకీయ జీవితం..
కొండా లక్ష్మణ్ ఆసిఫాబాద్ నుంచి1952 లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో 23 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా విశేష సేవలు అందించారు. 1969లో మొదలైన తొలి దశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి అండగా నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షపై అమితంగా ఆలోచించే బాపూజీ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు తన ఇల్లునే పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించిన సహృదయ శీలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఏక నాయకత్వం పనికిరాదని సమష్టి నాయకత్వం మాత్రమే ఆశయ సిద్ధికి దోహదం చేస్తుందని ఎలుగెత్తి చాటిన బాపూజీ.. 96 ఏళ్ల వయసులోనూ తెలంగాణ కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిన బాపూజీ నేటి తరం యువతకు ఆదర్శ ప్రాయుడు.

సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా..
కొండా లక్ష్మణ్ బాపూజీ 109 జయంతిని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్, మాజీ మంత్రి, ప్రస్తుతం కరీంనగర్ MLC L. రమణ, మహిళ శిషు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ, గనులు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ కుమార్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు హాజరుకానున్నారు.

ఆర్టీసీ బస్సుల ఏర్పాటు..
బాపూజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి రవీంద్ర భారతి వరకు ఉచితంగా బస్సులు నడుపుతున్నారు. 1) కొత్తపేట, PVT మార్కెట్ 2) LB నగర్ LPT వద్ద పెట్రోల్ బంక్ వద్ద , 3) NTR నగర్ 4) మీర్పేట్ చౌరస్తా 5) మనసురాబాద్ అయ్యప్ప గుడి వద్ద 6) హయత్ నగర్ సాయి బాబ గుడి వద్ద 7) కుంట్లూరు 8) పెద్ద అంబర్ పేట 9) తుర్కయంజాల్ 10) కాటేదాన్ 11) బోడుప్పల్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను తిప్పనున్నారు. ఈ కార్యక్రమానికి పద్మశాలీయులంతా అధిక సంఖ్యలో హాజరు కావాలని పద్మశాలీ సంఘాల నాయకులు కోరుతున్నారు.

Sri Konda Laxman Bapuji 109th Jayanthi Celebration Inviting Committee members..
1. Evarathri Anil, Honorary Chairman Inviting Committee
2. Kamartapu Murali, Chairman Inviting Committee
3. Vallakati Rajkumar, Chief Advisor
4. Gundu Sudharani, Chief Advisor
5. Kandagatla Swamy, Chief Advisor
6. Gaddam Jagannatham, Chief Advisor
7. Macharla Rama Chander Rao, Vice Chairman
8. Guduri Srinivas, Vice Chairman
9. Avvari Bhaskar, Vice Chairman
10. Punna Kailash Netha, Vice Chairman
11. Bodla tirupathi, Vice Chairman
12. Machha Sudhakar, Vice Chairman
13. Mandala Sriramulu, Vice Chairman
14. Vanam Dushyanthala, Vice Chairman
15. Barrenkala Madhusudhan, Vice Chairman
16. Chiluveru Kashinath, Vice Chairman
17. Vanam Vishwanatham, Vice Chairman
18. Vasala Ramesh, Vice Chairman
19. Methuku Sathyam, Vice Chairman
20. Putta Pandu Rangaiah, Vice Chairman
21. Ganji Srinivas, Vice Chairman
22. Boga Jagadesh, Vice Chairman
23. Guntuka Roopa, Vice Chairman
24. Chinni Rakesh, Vice Chairman
25. Kathula Sudharshan, Vice Chairman
26. Soma Chadra Shakar, Vice Chairman
27. Sanghishetty Jagadish, Vice Chairman
28. Kandagatla Bixapathy, Vice Chairman
29. Bomma Baghu Ram, Vice Chairman
30. Chikka Venkateshwarlu, Vice Chairman
31. Machha Varalaxmi. Vice Chairman
32. Ambati Srinivas, Vice Chairman
33. Dasu Suresh, Vice Chairman
34. Rudra Srinivas, Vice Chairman
35. Lagisheti Srinivas, Vice Chairman
36. Yaramada Venkanna Netha, Vice Chairman
37. Tadaka Ramesh, Vice Chairman
38. Gurram Shravan, Vice Chairman
39. Martha Ramesh, Vice Chairman
40. Ankam Paandu, Vice Chairman
41. Cheruku Swamy, Vice Chairman
42. Anitha Jakkani, Vice Chairman
43. Masna Ravi, Vice Chairman
44. Appam Srinivas,Vice Chairman
45. Punna Ganesh, Vice Chairman
46. Rajendhar Gortha, Vice Chairman
47. Sangeetham Srinivas (Siricilla), Vice Chairman
48. Guduru Srinivas (Siddipet), Vice Chairman
49. Konda Sandhya Rani Vice Chairman

============================
రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే బాపూజీ జయంతి వేడుకలకు సంబంధించిన ఫొటోలను, సమాచారాన్ని వాట్సప్ నంబర్ 83338 71117 కు పంపగలరు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Poland Capital

Follow us on social media

Related posts