అఖిల భారత పద్మశాలీ మహాసభ ఆవిర్భావ దినోత్సవ సమావేశం..

ప్రసంగిస్తున్న తడక యాదగిరి
ప్రసంగిస్తున్న తడక యాదగిరి

ప్రసంగిస్తున్న తడక యాదగిరి

చేనేతమిత్ర ప్రతినిధి: అఖిల భారత పద్మశాలీ మహాసభ ఏర్పడి 104 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పద్మశాలీయులు ఆదివారం(జూన్22న) పుల్లంపేటలో సమావేశమయ్యారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మశాలీ కుల సంఘ పరిశోధకులు తడక యాదగిరి, నూకల వెంకటసుబ్బయ్య మనవడు శ్రీరాములు, డా. చలమయ్య, సామల సుబ్బరాయుడు, కొత్తపేట సర్పంచ్ మణికంఠ, పొలిచెర్ల వెంకటేశ్వర్లు, పద్మాంజలి ఎడిటర్ బుస్సా వెంకటసుబ్బయ్య, కులస్థులు పాల్గొన్నారు. పద్మశాలీయుల శ్రేయస్సుకు దివంగత వడ్డేపల్లి విఠోభ, గుంటక నర్సయ్య పంతులు, కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి, అలాగే వారి సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.


కార్యక్రమంలో ప్రసంగిస్తున్న గుండేటి శ్రీధర్

1921లో తొలి మహాసభ..
అఖిల భారత పద్మశాలీ తొలి మహాసభ కడప జిల్లా పుల్లంపేట గ్రామంలో జరిగింది. కార్యంపూడి వెంకటకృష్ణకవి మార్గదర్శకత్వంలో దివంగత నూకల వెంకటసుబ్బయ్య కృషితో ఆకురాతి రంగనాయక స్వామి అధ్యక్షతన 1921వ సంవత్సరంలో మూడు రోజుల పాటు (జూన్ 22,23,24) ఘనంగా నిర్వహించారు. 2021 నాటికి వందేళ్లు పూర్తి కావడంతో శతాబ్ధి ఉత్సవాలను కూడా వైభవోపేతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Zeltix AI

Follow us on social media

Related posts