రేపు పద్మశాలీ సంఘం కార్తీక వనభోజన మహోత్సవం..

కర్నూలు: కర్నూలు జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీన(ఆదివారం) కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షులు కస్తూరి వేమయ్య, ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న, కోశాధికారి గుర్రం శివ ప్రసాద్​ తెలిపారు. కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని మాసా మసీదు పక్కనున్న ఎస్​ఎల్‌ఎన్​ ఫంక్షన్​ హాల్‌లో ఈ కార్యక్రమ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

కులబాంధవులకు ఆహ్వానం..
కార్యక్రమ వివరాలను కస్తూరి వేమయ్య వివరిస్తూ.. ‘‘కార్తీక మాసంలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి నివాసం ఉండే ఉసిరి చెట్టు కింద శ్రీ హరి ప్రతిమకు ఉసిరికాయలు సమర్పించి, గోవింద నామాన్ని స్మరిస్తూ పూజ చేయడం వల్ల అన్ని శుభాలు జరుపుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలను కూడా ఉంచి ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేవారు పూజా సామగ్రి తెచ్చుకోవాలి. పూజ అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశాం. అలాగే కర్నూలు పద్మశాలీ ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ (POPA) కల్చరల్ అకాడమీ కస్తూరి ప్రసాద్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థుల పేర్లు ఆయనకు అందాయి. అనంతరం కుల పెద్దలకు, IIIT, JEE, NEET ర్యాంకులు సాధించిన పద్మశాలీ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తరువాత 8 నుంచి 12, అలాగే 13- 30 ఏళ్ల లోపు మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు కూడా అందజేస్తాం. శ్రీ భద్రావతి, భావనారాయణ స్వామి దేవాలయ కమిటీ, పద్మశాలీ ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్, శ్రీ మార్కండేయ సేవా ట్రస్టు, పద్మశాలీ మహిళా విభాగం, పద్మశాలీ యువజన విభాగం సహకారంతో నిర్వహించే ఈ కార్తీక వనభోజన కార్యక్రమానికి నగరంలోని కుల బాంధవులంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం’’ అని విజ్ఞప్తి చేశారు. Beinveron

Follow us on social media

Related posts