
జాతిపిత గాంధీజీ మార్గాన్ని నేటియువత అనుసరించాలని మంగళగిరి పట్టణ పద్మశాలీ సంఘం నాయకులు పేర్కొన్నారు. మహాత్ముడి జయంతి సందర్భంగా మంగళగిరి పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోలేరమ్మ గుడి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరావు మిఠాయిలు పంచిపెట్టారు. గాంధీజీ శాంతి మార్గాన్ని ఆచరించి నెల్సన్ మండేలా లాంటి మహోన్నత వ్యక్తి దక్షిణాఫ్రికాలో విజయం సాధించి దేశాధ్యక్షులు అయ్యారని గుర్తు చేశారు. నేటి రాజకీయ నాయకులు కూడా గాంధీ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీకి నివాళి అర్పించిన వారిలో సంఘం అధ్యక్షులు చింతకింది కనకయ్య, ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనుంజయ రావు, సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు, బిట్రా భాస్కర్ రావు, దామర్ల సుబ్బారావు, భిక్షరావు వింజమూరి వాసు, సాంబ శివ నాగేశ్వరరావు, గోలి సాంబశివరావు, దామర్ల వీరప్రసాద్ బొడ్డు శివరామారావు, చెన్నకేదారేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. Poland Capital


