బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2వ తేదీన  ఘనంగా నిర్వహించారు. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక అభిమానులు జిల్లాలోని పలుచోట్ల గాంధీజీ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళి అర్పించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఫౌండేషన్‌ ప్రతినిధులు కర్నూలులోని జాయ్‌ అనాథ ఆశ్రమంలో పిల్లలకు నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం గురించి చిన్నారులకు అవగాహన కల్పించారు. సెరూడ్స్‌ వృథాశ్రమంలో వృద్ధులకు పండ్లు, మందులు అందజేశారు.

బి. తాండ్రపాడులో..

బుట్టా ఫాండేషన్‌ ఆధ్వర్యంలో బి తాండ్రపాడులో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సర్పంచ్‌ ఆకెపోగు జయన్న, ఎంపీటీసీ కే మద్దిలేటి, గ్రామస్థులు హాజరయ్యారు. జాతిపిత చిత్రపటానికి పూలమాలల వేసి నివాళి అర్పించారు. మహాత్ముడి సేవలను కొనియాడారు. గాంధీజీ చూపిన మార్గం అందరికి అనుసరణీయమని పేర్కొన్నారు.

 

Avex Pro 2.0

Follow us on social media

Related posts

Leave a Comment