దసరా శరన్నవరాత్రోత్సవాలు కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరీ దేవి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. నవరాత్రోత్సవాల సందర్భంగా రోజూ ఉదయం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, తీర్థ ప్రసాద వితరణ, అలాగే సాయంత్రం కుంకుమార్చన,చిన్నతేరు, ప్రాకారోత్సవం ఉంటాయి.
వివిధ అలంకారాలలో అమ్మవారు
7వ తేదీ అమ్మవారు శైలపుత్రి అలంకారంలో, 8వ తేదీ బ్రహ్మచారిణి, 9వ తేదీ చంద్రఘంట, 10వ తేదీ కూష్మాండ, 11వ తేదీ స్కంధమాత, 12వ తేదీ కాత్యాయణి, 13వ తేదీ కాళరాత్రి, 14వ తేదీ మహాగౌరీ, 15వ తేదీ సిద్ధిధాత్రి అలంకారంలో దర్శమిస్తారు. చివరి రోజు సాయంత్రం అమ్మవారి ఆలయంలో శమీపూజ, సింహవాహన సేవ నిర్వహించనున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఈ బ్రహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
చౌడేశ్వరీ దేవి దీక్షధారణ
చౌడేశ్వరీదేవి దీక్షధారణ కార్యక్రమం నవంబర్‌లో ప్రారంభమవుతుంది. నవంబర్ 11న మండల దీక్ష (41రోజులు), డిసెంబర్ 10న అర్ధ మండల దీక్ష (21 రోజులు), డిసెంబర్ 21న 11 రోజలు దీక్ష మొదలవుతుంది. ఈ దీక్షలు డిసెంబర్ 31తో పూర్తవుతాయి. డిసెంబర్ 29 నుంచి 31వ తేదీ వరకు ఆలయంలో చండీ హోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో వీఎల్‌ఎన్ రామానుజన్ తెలిపారు. Avex Pro 2.0

