హైదరాబాద్: పద్మశాలీ సంఘం ఎల్బీనగర్ సర్కిల్ మహిళా విభాగం నూతన కార్యవర్గ ఎన్నిక ఇటీవల జరిగింది. అధ్యక్షురాలిగా ఊర్కొండ రమాదేవి, ప్రధానకార్యదర్శిగా పేరాల సుజాత, కోశాధికారిగా గుత్తి పూర్ణిమ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షురాలిగా చిక్కా భారతమ్మ, ఉపాధ్యక్షురాలుగా చిలుకూరు మాధవి, ఎడం సంతోషి, గౌరవ సలహాదారులుగా చింతా ఉమా శ్రీనివాస్, రావిరాల సంధ్యారాణి, చెరిపల్లి వర్ణలీల, కార్యదర్శులుగా పొట్టబత్ని పద్మావతి, వనం శోభ, గోరంట్ల సోమ కవిత, బొడ్డు అనిత, సహాయ కార్యదర్శిలుగా సంగిశెట్టి భార్గవి, బోడ నిర్మల, పున్నా పల్లవి, గర్దాసు చంద్రకళ, గంజి జయమ్మ, న్యాయ సలహాదారుగా అయిటిపాముల శ్రవంతిని ఎన్నుకున్నారు.
ఇటీవల ప్రమాణ స్వీకారం..
ఇటీవల దసరా మేళా ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో వీరంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ నగర్ సంఘం అధ్యక్షలు పున్న గణేష్, ప్రధానకార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ, అఖిల భారత పద్మశాలీ అన్నదాన సత్రాల మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్, తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపా, గ్రేటర్ హైదరబాద్ పద్మశాలీ సంఘం అధ్యక్షురాలు పోరండ్ల శారద, పద్మశ్రీ గజం అంజయ్య, జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, బాసర పద్మశాలి అన్నసత్రం అధ్యక్షులు రాపోలు సుధాకర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్, సికింద్రాబాద్‌లోని పద్మశాలి సేవా సమాజ్ ట్రస్ట్ చైర్మన్ నోముల రామ్ ప్రకాష్, మేళా చైర్మన్ కౌకుంట్ల రవితేజతో పాటు పద్మశాలీ సంఘం ఎల్.బి.నగర్ సర్కిల్ కార్యవర్గ కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పద్మశాలీ దసరా మేళా ఎక్కడ..ఎప్పుడు తెలుసుకునేందుకు దిగువన ఉన్న ఫొటోపై క్లిక్ చేయండి
(వివిధ ప్రాంతాల్లో జరిగే పద్మశాలీ సామాజిక వర్గ కార్యక్రమాల వివరాలను పంపగలరని మనవి) Vertex Inviolex




