‘ప్రగడ కోటయ్య పేరున చేనేత భవనం, మ్యూజియం ఏర్పాటు చేయాలి’

విజయవాడ: అఖిల భారత పద్మశాలి సంఘం (ABPS) కేంద్ర కార్యవర్గ సమావేశం (CWC) విజయవాడలోని లబ్బీపేట పద్మశాలి భవన్‌లో ఆదివారం జరిగింది. సంఘం రాష్ట్ర కన్వీనర్ జి.వి.నాగేశ్వరరావు ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు సంఘం నాయకులు ప్రసంగించారు.

‘నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి..’

‘‘తెలంగాణలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో చేనేత బంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయం. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నారు. అందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. 5శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వడం అభినందనీయం.

మంగళగిరిలో ప్రగడ కోటయ్య పేరున చేనేత పార్క్, ఆయన జ్ఞాపకార్థం చేనేత భవనం, చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చేనేత వర్గాలకు నామినేటెడ్ పోస్టులు కూడా కేటాయించాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో చేనేత వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి.’’
– కందగట్ల స్వామి, ABPS అధ్యక్షులు

‘రాజకీయ ఎదుగుదలకు సహకరించాలి’

‘‘అఖిల భారత పద్మశాలీ సంఘంలోని 18 ప్రాంత సంఘాలు, ఉప సంఘాలు ఇక్కడ సమావేశం కావడం ఆనందంగా ఉంది. సంఘం చేసే కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతుంది. ఇక మహిళా సంఘం పద్మశాలి మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయాభి కృషి చేస్తుంది. నామినేటెడ్ పోస్టుల్లో చేనేత సామాజిక వర్గ మహిళలకు స్థానం కల్పించి రాజకీయ ఎదుగుదలకు ప్రభుత్వం సహకరించాలి. చేనేత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పరిష్కరించాలి.’’
– వనం దుష్యంత్ శకుంతల, ABPS మహిళా సంఘం అధ్యక్షురాలు, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్

‘ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’

‘చేనేత రంగానికి అండగా నిలుస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అఖిల భారత పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ విజయవాడలో నిర్వహించడం ఆనందంగా ఉంది. ప్రతి ఆరుమాసాలకోసారి ఒక్కో రాష్ట్రంలో ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సారి ఏపీలో నిర్వహించాలని కోరాం. మా కోరిక మేరకు అది జరిగింది. సమావేశానికి హాజరయిన పద్మశాలి సంఘాల నాయకులకు, కులస్థులకు ధన్యవాదాలు.’’
– జీవీ నాగేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్

సమావేశంలో ఏబీపీఎస్ గౌరవ అధ్యక్షులు శ్రీధర్ సుంకర్‌వార్ , ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి, రాయలసీమ ప్రాంత పద్మశాలీ సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బళ్ల పరమేశ్వరరావు, విజయనగరం నుంచి వానపల్లి వెంకటరావు, ప్రదీప్ శాంగా, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

చిత్రమాలిక..

సమావేశంలో మాట్లాడుతున్న గడ్డం జగన్నాథం
ప్రసంగిస్తున్న కామర్తపు మురళి
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని మేడం మాదబత్తుల శ్రీదేవిని సన్మానిస్తున్న ఏబీపీఎస్ సభ్యులు
కందగట్ల స్వామిని సన్మానిస్తున్నపద్మశాలీయులు
సమావేశానికి హాజరయిన పద్మశాలీయులు

(వివిధ ప్రాంతాల్లో జరిగే పద్మశాలీ సామాజిక వర్గ కార్యక్రమాల వివరాలను పంపగలరని మనవి)

Cell: 83338 71117 Duneriat

Follow us on social media

Related posts