హైదరాబాద్: పద్మశాలీ బిజినెస్ నెట్‌వర్క్ (PBN) సమావేశం రేపు (సెప్టెంబర్ 18వ తేదీ) హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వర్కాల బాలాజీ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట రోడ్‌లోని హోటల్ గ్రీన్ పార్క్‌లో ఈ సమావేశం జరగనుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ రానున్నారని చెప్పారు. ఈ మేరకు ఆమెకు ఆహ్వానపత్రిక కూడా అందజేశామని తెలిపారు. ఇటీవల వరంగల్ జిల్లా హనుమకొండలో నిర్వహించిన PBN meet విజయవంతమైందన్నారు.

కొండా సురేఖ గురించి..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు కొండా సురేఖ..ఆగస్టు 19న వరంగల్ జిల్లాలో జన్మించారు. విద్యార్థి దశలోనే సామాజిక చైతన్యంతో, సేవా కార్యక్రమాలపై ఆసక్తి కనబరిచారు. భర్త కొండా మురళి కూడా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతున్నారు. కొండా దంపతులకు ఒక కూతురు ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం..
కొండా సురేఖ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. 1995లో వంచనగిరి ఎంపీటీసీగా గెలిచి ఆ తర్వాత గీసుగొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1999లో కాంగ్రెస్ టికెట్‌పై శాయంపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో అదే స్థానం నుంచి రెండోసారి గెలిచారు. 2009లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి గెలుపొందారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వైసీపీని వీడారు. అనంతరం
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ(ఇప్పటి BRS)లో చేరి తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తూర్పు వరంగల్ నుంచి గెలిచిన కొండా సురేఖ.. ప్రస్తుతం దేవాదాయ, అటవీ శాఖలకు మంత్రిగా ఉన్నారు.
PBN ఎందుకు?
పద్మశాలీ వ్యాపారుల కనెక్టివిటీ కోసం ఏర్పాటయిన వేదిక. అవకాశం ఉన్న చోట వ్యాపారాల విస్తరణ, పరస్పర సహకారంతో ఎదగడం కోసం ఏర్పాటయిన సమూహం. అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు, దూరదృష్టి గల వ్యక్తుల సహకారంతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్థాపించిన సంస్థ PBN.

HOTEL GREENPARK GOOGLE LOCATION కోసం దిగువన ఉన్న ఫొటోపై క్లిక్ చేయండి..

వరంగల్ జిల్లా హనుమకొండలో ఇటీవల నిర్వహించిన PBN meet గురించిన సమాచారం కోసం దిగువన ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి..



