హైదరాబాద్: పద్మశాలీ సంఘం ఎల్.బీ నగర్ సర్కిల్ (రి.నెం.705/2009) ఆధ్వర్యంలో పద్మశాలీ దసరా మేళా జరగనుంది. హైదరాబాద్ అనన్య ఎకో పార్క్ఆవరణలోని హరిణి వనస్థలి (డీర్ పార్క్) వేదికగా అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. మేళాలో ఉచిత వైద్య శిభిరం, వివాహ పరిచయ వేదిక, చిన్నారులు, మహిళలకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పద్మశాలీ ప్రముఖుల సందేశాలు ఉంటాయని సంఘం అధ్యక్షులు పున్న గణేష్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పద్మశాలీ కుల సంఘాల పెద్దలు, కులస్థులు కుటుంబసమేతంగా విచ్చేయాలని సంఘం ప్రధానకార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.




బ్రోచర్ ఆవిష్కరణ..
మేళా ఆహ్వానపత్రికను ఇటీవల మన్సూరాబాద్‌లోని పాలాది పరమేశ్వర్ వృద్ధాశ్రమంలో ఆవిష్కరించారు. అనంతరం పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ మహిళా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.అధ్యక్షురాలిగా ఊర్కొండ రమాదేవి, గౌరవ అధ్యక్షురాలిగా చిక్కా భారతమ్మ, గౌరవ సలహాదారులుగా చింతా ఉమాశ్రీనివాస్, రావి రాల సంధ్యారాణి, చెరిపల్లి వర్ణలీల, ఉపాధ్యక్షురాలిగా ఇడెం సంతోషి, ప్రధానకార్యదర్శిగా పేరాల సుజాత, కోశాధికారిగా గుత్తి పూర్ణిమ ఇటీవల ఎన్నికయ్యారు.



ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీ అన్నదాన సత్రాల మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్, తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపా, గ్రేటర్ హైదరబాద్ పద్మశాలీ సంఘం అధ్యక్షురాలు పోరండ్ల శారద, పద్మశ్రీ గజం అంజయ్య, జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, బాసర పద్మశాలి అన్నసత్రం అధ్యక్షులు రాపోలు సుధాకర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్, సికింద్రాబాద్‌లోని పద్మశాలి సేవా సమాజ్ ట్రస్ట్ చైర్మన్ నోముల రామ్ ప్రకాష్, మేళా చైర్మన్ కౌకుంట్ల రవితేజతో పాటు పద్మశాలీ సంఘం ఎల్.బి.నగర్ సర్కిల్ కార్యవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
For google location click on the below Photo

(వివిధ ప్రాంతాల్లో జరిగే పద్మశాలీ సామాజిక వర్గ కార్యక్రమాల వివరాలను పంపగలరని మనవి) Essor Opulex


