‘‘నేతన్నల వృత్తిపర సమస్యల పరిష్కారానికి చేనేత కులాలన్నీ కలిసి పోరాడాలి. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలి. సమస్యల పరిష్కారానికి రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో రాణించాలనుకునే యువతను కులసంఘాలు ప్రోత్సహించాలి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నేతన్నలకు బీమా పథకాన్ని సజావుగా అమలు చేస్తుంది. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అన్ని రాష్ట్రాలలో శాఖలను ఏర్పాటు చేసి చేనేత వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండడం అభినందనీయం’’
– ఎల్. రమణ, శాసనమండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్రం


ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ హైదరాబాద్ తెలంగాణ ప్రాంత చేనేతల ఆత్మీయ సమ్మేళనం మార్చి 5న హైదరాబార్ వనస్థలిపురం కర్నాటి గార్డెన్స్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రమణ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, విశ్రాంత ఐఏఎస్ తోగర్ల చిరంజీవులు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్‌తో పాటు తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చేనేత కులాల ప్రతినిధులు హాజరయ్యారు.

చేనేత కులాలు విడివిడిగా కాకుండా, ఏకతాటిపై పోరాడితే సమస్యల పరిష్కారం సులువవుతుందని, చేనేత వృత్తిని పరిరక్షించుకోగలమని పలువురు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. చేనేత కార్మికుల కష్టాలను అధిగమించడం కోసం చేనేత కులాల రాష్ట్ర సంఘాలు, ఉద్యమ సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ, వ్యాపార సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న చేనేత వర్గాలకు చెందిన నాయకులతో కలిసి సంఘటితంగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివరించారు.

చేనేత కవి రాపోలు జగన్ మాట్లాడుతూ ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వివిధ వృత్తి నిపుణులు, విద్యావంతులు, మేధావులు, చేనేత కుల సంఘాలు, వివిధ పార్టీలలోని రాజకీయ నాయకులతో కలిసి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఏర్పడిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని చేనేత కులాలు, వివిధ సంఘాలతోను కలిసి ముందుకు వెళ్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెల్లా మార్కండేయులు, కటకం నర్సింగ్ రావు, బొమ్మ రఘురాం నేత, బి ఆనంద్ ప్రసాద్, మాజీ ఎంపీపీ వేముల బాలరాజు, వనం శాంత కుమార్, రాపోలు జ్ఞానేశ్వర్, వెంకటేశ్వరరావు, గువ్వల శంకర్, భోగం లక్ష్మయ్య , పసలాది సబిత, గడ్డం వెంకటేశ్వర్లు, సామల భాస్కర్, శ్రవణ్ కుమార్, వడ్డేపల్లి పరమేష్, చెరుకు స్వామి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


చేనేత సమాజానికి ఎంతో కృషి చేసిన మహానాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్ పిట్టి త్యాగరాయశెట్టి, అన్నాదురై, మాచాని సోమప్ప, పుత్సల సత్యనారాయణ, ప్రగడకోటయ్య, కుండా రామయ్య, అగిశం వీరప్ప, నల్ల నరసింహులు, సుద్దాల హనుమంతు, తిరుపూర్ కుమరన్ చిత్రపటాలు సమావేశ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
![]()
చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika


