నంద్యాల: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం మార్కండేయ నగర్‌లో పద్మశాలీ భవన్‌ను నిర్మించనున్నారు. సోమవారం (6-3-2023) ఉదయం 7. 25 గంటలకు భూమి పూజ ప్రారంభం కానుంది. శ్రీశైలం నియోజకవర్గ శాసన సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై భూమి పూజను ప్రారంభించనున్నారు. విశిష్ఠ అతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు, డాక్టర్ శింగరి సంజీవ కుమార్ విచ్చేస్తున్నారు. వీరితో పాటు గౌరవ అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ, ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు భీమునిపల్లె వెంకటసుబ్బయ్య హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి పద్మశాలీయులంతా హాజరై జయప్రదం చేయాలని ఆత్మకూరు తాలుకా పద్మశాలీ సంఘం భక్త మార్కండేయ దేవస్థాన కమిటి ఆహ్వానం పలుకుతోంది.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Which Canadian casino pays out the most?

